సుహాస్ 'హే బలవంత్'.. ప్రాఫిట్స్ జోన్లోకి వెళ్లిందా?
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ లో నటించిన హే బలవంత్ మూవీ.. రీసెంట్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ లో నటించిన హే బలవంత్ మూవీ.. రీసెంట్ గా రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. గోపి అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఆ సినిమాను నిర్మాతలు కమ్ డిస్ట్రిబ్యూటర్స్ బన్నీవాస్, వంశీ నందిపాటి ఈనెల 20న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా సాలిడ్ వసూళ్లు సాధిస్తోంది.
ముఖ్యంగా తక్కువ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆ కామెడీ డ్రామా, ఇప్పుడు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. మొదటి రోజు నుంచే ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ నుంచి మంచి స్పందన లభించడంతో స్టేబుల్ ఆక్యుపెన్సీ నమోదవుతోంది.
నిజానికి సినిమా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా మంచి రికవరీ సాధించింది. ఓటీటీ, ఇతర హక్కులు కలిపి సుమారు రూ.7 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. థియేట్రికల్ షేర్ ద్వారా మరో రూ.5 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు అంచనా. దీంతో సినిమా దాదాపు రూ.12 కోట్ల రికవరీ సాధించినట్లు తెలుస్తోంది. ఇక సినిమా నిర్మాణ వ్యయం సుమారు రూ.10 కోట్లు అని టాక్.
దీంతో ఇప్పటికే బడ్జెట్ ను దాటేసి లాభాల్లోకి సినిమా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో హే బలవంత్ మూవీ.. ఫిబ్రవరిలో వచ్చిన ప్రాఫిటబుల్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక సినిమాలో సుహాస్ తన నేచురల్ యాక్టింగ్ తో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు నరేష్ వీకే, సుదర్శన్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది.
సింపుల్ సీన్స్, న్యాచురల్ డైలాగులు, లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మౌత్ టాక్ రావడం కలెక్షన్స్ పెరిగాయి. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి సరైన ఎనర్జీ ఇచ్చాయి. పాటలు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో సినిమాకు ఎక్స్ట్రా బజ్ ఏర్పడింది.
ప్రీ-రిలీజ్ ప్రమోషన్లు కూడా బాగా ప్లాన్ చేయడం వల్ల విడుదలకు ముందే సినిమాపై ఆసక్తి పెరిగింది. బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ ప్లానింగ్, టార్గెట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ సినిమాకు ప్లస్ అయ్యాయని టాక్. అందుకే మూవీ సక్సెస్ క్రెడిట్ లో మెయిన్ పార్ట్ వాళ్లకే చెందుతుంది. ఏదేమైనా సరైన ప్లానింగ్, పెర్ఫెక్ట్ ప్రమోషన్, పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది హే బలవంత్ మూవీ.