• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నోటా' లో ముగ్గురు సీఎంల...

'నోటా' లో ముగ్గురు సీఎంల లాలూచీ

By - Tupaki Desk
Update: 2018-09-27 06:34 GMT
ముఖ్య మంత్రి స్థాయి ప్ర‌ముఖుల ప్ర‌స్థావ‌న అంటే డౌట్స్ షురూ. సీఎమ్‌ ల‌పైనే సీన్స్‌ అంటే .. రాజ‌కీయ అవినీతిపై ప్ర‌స్థావిస్తున్నారా? అన్న సందేహాలు వ‌స్తాయి. `నోటా`లో అందుకు ఆస్కారం ఉందా? అంటే ఉండే ఛాన్స్ ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఎందుకంటే ఈ సినిమా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్నది. పైగా ముగ్గురు ముఖ్య‌మంత్రుల జాత‌కాల్ని ట‌చ్ చేస్తున్నార‌ట‌. ఆ ముగ్గురు సీఎంలు ఎవ‌రు? అంటే ..ద‌శాబ్ధాల పాటు పాల‌న సాగించి దేశ‌రాజకీయాల్లోనే గొప్పగా  పేరు బ‌డిన వారేన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఆంధ్ర ప్ర‌దేశ్‌ ను ద‌శాబ్ధం పైగానే పాలించిన కాంగ్రెసేత‌ర ముఖ్య‌మంత్రి - టీడీపీ పార్టీ ఫౌండ‌ర్ అధ్య‌క్షుడు - మాజీ సీఎం నంద‌మూరి తార‌క రామారావు - హైటెక్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపైనా `నోటా`లో కీల‌క స‌న్నివేశాల్ని తెలుగు - త‌మిళ ప్రేక్ష‌కులు చూడ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఐదు సార్లు త‌మిళ‌నాడును పాలించిన మేటి మ‌హిళా సీఎం - అమ్మ‌ జ‌య‌ల‌లిత‌పైనా `నోటా`లో ప్ర‌స్థావ‌న ఉందిట‌. ఆ ముగ్గురు ముఖ్య‌మంత్రుల‌పై చెప్పుకోద‌గ్గ సీన్లే ఉన్నాయి కాబ‌ట్టి వీటిలో వివాదాలు తొంగి చూసే చాన్సుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఇదే సందేహాన్ని వ్య‌క్తం చేస్తే.. స్టూడియోగ్రీన్ సంస్థ అధినేత - నోటా నిర్మాత‌ జ్ఞాన‌వేల్ రాజా ఓ మీడియా స‌మావేశంలో ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ``ఎన్టీఆర్‌ - చంద్ర‌బాబు నాయుడుపై స‌న్నివేశాలు ఉన్న మాట నిజ‌మే. `నోటా`లో వారిపై సీన్స్‌ ని యాడ్ చేశాం. అలానే త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో చేరిన‌ప్పుడు ఏం జ‌రిగిందో చూపే సీన్స్ ఉన్నాయి. అయితే వీటిలో ఎక్క‌డా వివాదాల్ని ట‌చ్ చేయ‌లేదు`` అని స‌మాధాన‌మిచ్చారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో నేటి రాజ‌కీయాలు - తెర‌వెన‌క పాలిటిక్స్‌ ని మాత్రం గొప్ప‌గా ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. స‌రిగ్గా ద‌స‌రా సెల‌వుల‌కు ముందు అక్టోబ‌ర్ 5న ఈ సినిమాని తెలుగు - త‌మిళ్‌ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక‌వేళ హిట్ట‌యితే ద‌స‌రా సెల‌వులు పెర్ఫెక్ట్‌ గా క‌లిసొస్తాయ‌న్న‌దే ప్లాన్. త‌మిళ‌నాడులో ప్ర‌చారం బావున్నా - తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ `నోటా`కు స‌రైన ప్ర‌మోష‌న్ లేనేలేదు. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ‌లో భారీ ఈవెంట్ను ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.


Tags:    
  • Vijay Devarakonda 
  • NOTA Movie 
  • Telugu NEWs 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS