OTT స‌హా డిజిట‌ల్ వేదిక‌ల‌పై సెన్సార్ షిప్ కి ప్లాన్

Update: 2020-10-16 06:00 GMT
ఓటీటీ యూట్యూబ్ సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై సెన్సార్ షిప్ లేక‌పోవ‌డంతో ఆయా వేదిక‌ల‌పై విశృంఖ‌ల‌తో పెచ్చుమీరుతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. డిజిట‌ల్ పై నియంత్ర‌ణ కోసం సెన్సార్ నియామ‌కం లేక‌పోవ‌డంపై విరుచుకుప‌డేవాళ్లు ఉన్నారు. అయినా ఇన్నాళ్లు ఓటీటీ కంటెంట్ పై కానీ.. యూట్యూబ్ లేదా ఇత‌ర‌త్రా డిజిట‌ల్ మాధ్య‌మాల్లో కంటెంట్ పై కానీ ఎలాంటి సెన్సార్ షిప్ లేదు.

దీంతో విశృంఖ‌ల‌త అంత‌కంత‌కు పెచ్చుమీరుతోంది. నెట్ ఫ్లిక్స్ .. అమెజాన్ స‌హా ప‌లు ఓటీటీలు వేడెక్కించే కంటెంట్ ని య‌థేచ్ఛ‌గా స్మార్ట్ యుగంలోకి పంప్ చేస్తుంటే ఆపేవాళ్లే లేక‌పోయారు. అయితే దీనికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో పోరాటం సాగుతోంది.

OTT ప్లాట్ ఫారమ్ ‌ల ప‌రిధి దృష్ట్యా త్వ‌ర‌లో నియ‌మ‌నిబంధనలు సిద్ధ‌మ‌వుతాయి అన్న స‌మాచారం అందుతోంది. కోవిడ్ కాలంలో ఓటీటీల‌కు అంతా క‌లిసొచ్చింది. అడ్డూ ఆపూ లేకుండా చెల‌రేగాయి.  థియేటర్లు మూసివేయ‌డ‌మే గాక‌.., కొత్త టెలివిజన్ కార్యక్రమాలు కూడా ఆగిపోయినప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల హ‌వా సాగింది. ఈ స‌న్నివేశంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించి.. అమెజాన్ ప్రైమ్  నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించాలని కేంద్రానికి నోటీసు జారీ చేసింది. నియంత్రణ లేకపోవడం వల్ల ఆయా డిజిటల్ ప్లాట్ ‌ఫామ్ ‌లపై ప్రసారం చేసే కంటెంట్ పై సెన్సార్ ‌షిప్ లేదు. థియేటర్లలో భవిష్యత్తు ఇంకా అనిశ్చితంగా ఉన్నందున OTT ప్లాట్ ‌ఫారమ్ లపై నిబంధనలు అనివార్యంగా కనిపిస్తున్నాయి`` అని వ్యాఖ్యానించింది.

ఏ చట్టబద్ధమైన సంస్థ ద్వారా నియంత్ర‌ణ అనేది లేక‌పోతే..డిజిటల్ ప్లాట్ ‌ఫారమ్ ల ద్వారా తమ కంటెంట్ ను పాస్ చేయించుకుంటున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌?  సుప్రీం నోటీసు తర్వాత కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు స్వయంప్రతిపత్త నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాల‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. మునుముందు ఓటీటీ యూట్యూబ్ స‌హా ప్ర‌తిదీ నియంత్ర‌ణ ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News