• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ బ్లాక్ బస్టర్లో అతను...

ఆ బ్లాక్ బస్టర్లో అతను చేయాల్సిందట

By - Tupaki Desk
Update: 2018-11-18 17:30 GMT
అక్కినేని నాగార్జున-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘సూపర్’ సినిమాలో మామా మామా అంటూ వెరైటీగా విలనిజం చేసిన బాలీవుడ్ నటుడు గుర్తున్నాడా? అతడి పేరు పియూష్ మిశ్రా. బాలీవుడ్లో అతడికి మంచి పేరే ఉంది. అక్కడ మూడు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న పియూష్.. ఒకప్పుడు హీరోగా కూడా ప్రయత్నించాడు. అతడికి బాలీవుడ్ ఆల్ టైం హిట్లలో ఒకటైన ‘మైనే ప్యార్ కియా’లో హీరోగా నటించే అవకాశం వచ్చిందట. సల్మాన్ ఖాన్‌ కు లైఫ్ ఇచ్చిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత అతను పెద్ద స్టార్ అయిపోయాడు. అలాంటి సినిమాకు దర్శకుడు సూరజ్ ఆర్.బర్జాత్యా ముందు హీరోగా అడిగింది పియూష్ మిశ్రానేనట. ఐతే పియూష్ అందుకు ఒప్పుకోలేదట. ఆ సినిమాను తాను ఎందుకు వద్దన్నానో తనకే తెలియదని చెప్పాడు పియూష్.

‘‘మైనే ప్యార్‌ కియా సినిమాలో నటించనని ఎందుకు చెప్పానో నాకే తెలియదు. ఆ సినిమా సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీని అప్పటికీ ఎంచుకున్నారు. కథానాయకుడి కోసం చూస్తున్నారు. ఈ సినిమాతో నన్ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని దర్శకుడు సూరజ్ బర్జాత్యా అనుకున్నారు. అప్పట్లో నేను అందంగా ఉండేవాడిని. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో నాకే తెలియదు. నేను నటించకపోవడానికి కారణం ఇదేనంటూ చాలా వదంతులు వచ్చాయి. అవి నిజం కాదు. ప్రేమ్‌ పాత్రను వద్దు అనుకున్నందుకు నేనెప్పుడూ బాధపడలేదు. అందులో నేను చేసుంటే ఎలా ఉండేది? అని ఊహించుకోనూ లేదు’’ అని పియూష్ చెప్పాడు. ఒకవేళ పియూషే ప్రేమ్ పాత్రలో నటించి ఉంటే.. ఇప్పుడు అతడిని అందరూ ఒక స్టార్ లాగా చూస్తుండేవాళ్లేమో. మరి ఆ సినిమా చేయకుంటే సల్మాన్ ఇప్పుడున్న స్థాయిలో ఉండేవాడా?
Tags:    
  • Piyush Mishra 
  • Salman Khan 
  • Maine Pyar Kiya 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS