పైరసీని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్

Update: 2016-03-29 19:30 GMT
పైరసీ ఓ పెద్ద భూతం.. పైరసీ కళా రంగానికి పట్టిన పిశాచి.. సినిమా రంగాన్ని సర్వనాశనం చేసేందుకు పుట్టిన మహమ్మారి.. కొందరు హీరోలపై మరికొందరు చేసే కుట్రల ఫలితమే పైరసీ.. అబ్బో  పైరసీ గురించి చెప్పుకోవాలంటే ఇండస్ట్రీ నుంచి ఇలాంటి వాదనలు బోలెడన్ని ఉంటాయి. అలాగే తమ హీరో కొత్త సినిమా వచ్చినపుడు.. ఫ్యాన్స్ లో కూడా చైతన్యం పెల్లుబుకుతుంది.

ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ పై మ్యాచ్ లో ఇండియా గెలిచినపుడు చేసినంత రచ్చను.. పైరసీపై ఫైటింగ్ లో చేసి చూపిస్తామని మాటల్లో చెబతారు. ఎక్కడైనా ఒకట్రెండు సీడీలు కనిపించగానే.. వాడిని చితకబాదుతున్నట్లుగా కెమేరాలకు ఫోజులిచ్చి తర్వాత...  తర్వాత ఇంకేముంటుంది. ఆ కథ కంచికే.  కానీ ఇప్పుడు పైరసీని ఫుల్లుగా ఎంజాయ్ చేసేస్తున్నారు అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందర్భంగా జరిగిన వేడుకలకు సంబందించిన వీడియోలు.. ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవేమీ అఫీషియల్ గా బయటకు ఇచ్చినవి కావు. అయినా సరే సోషల్ సైట్లలో హాట్ టాపిక్ అయిపోతున్నాయి.

ఇంకా కొందరు ఛానల్స్ ప్రబుద్ధులు అయితే.. ఇంటర్నెట్ లోంచి డౌన్ లోడ్ చేసి, ఎక్స్ క్లూజివ్ అనే వాటర్ మార్క్ వేసుకుని మరీ.. ఈ పైరేటెడ్ వీడియోలను తెగ ప్రసారం చేసేస్తున్నారు. పైరసీని వ్యతిరేకిస్తే అన్ని సార్లు వ్యతిరేకించాలి. ఎంజాయ్ చేస్తామంటే ఆ మాటలు మాట్లాడకుండా ఉండాలి. కానీ ఫ్యాన్స్ లోను, మీడియాలోనే ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఉంటే ఎలా
Tags:    

Similar News