ఆ హీరోయిన్ మార్నింగ్ వాక్ కోసం ఫోటోగ్రాఫ‌ర్ల ప‌డిగాపులు?

Update: 2021-03-01 08:30 GMT
ట్రెండ్ సృష్టించ‌డం వేరు.. ట్రెండ్ సెట్ చేయ‌డం వేరు!! ఈ రెండు కోణాల్లోనూ మ‌లైకా అరోరా ట్యాలెంటే వేరు. ముఖ్యంగా బాలీవుడ్ లో లేట్ ఏజ్ లోనూ అందాల ఆర‌బోత‌తో గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న హాట్ లేడీగా మ‌లైకా పేరు పాపుల‌రైంది.వ‌య‌సు 50కి చేరువ అవుతున్నా అస‌లు ఆ ల‌క్ష‌ణాలేవీ త‌న‌లో క‌నిపించ‌వు. ఇంకా టీనేజీ భామ‌లా ఘాటు ప్రేమాయ‌ణంతో హాట్ టాపిక్ గా మారుతోంది. పైగా 30 ప్రాయం కుర్రాడితో ప్రేమాయ‌ణం సాగిస్తున్న భామ‌గా మ‌లైకా ఇస్పీడ్ నిరంత‌రం హాట్ టాపిక్కే.మ‌లైకా పబ్లిక్ ఔటింగుకి బ‌య‌ల్దేరింది అంటే చాలు కెమెరా క‌ళ్లు అక్క‌డ వాలిపోవాల్సిందే. అలా మార్నింగ్ వాక్ కోసం వెళ్లినా.. జిమ్ యోగా సెష‌న్స్ కి వెళ్లినా.. మార్కెట్లో అడుగు పెట్టినా.. ఫోటోగ్రాఫ‌ర్లంతా ప‌డిగాపులు ప‌డాల్సిందే.

ఇటీవ‌లి కాలంలో అంత స్పీడ్ చూపించిన వేరొక భామ లేదు అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ఏజ్ లోనూ యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో ఘాటైన ప్రేమాయ‌ణం సాగిస్తూ హెడ్ లైన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిరంత‌రం బ్రాండ్ ప్ర‌చారంలో.. ఇన్ స్టా ప్ర‌చారంలో ఆర్జిస్తూ టీవీ డ్యాన్స్ రియాలిటీ షోల‌తోనూ బిజీగా ఉన్న భామ‌గా మ‌లైకా పేరు మార్మోగుతోంది. ఐటెమ్ నంబ‌ర్ల క్వీన్ గా వెలిగిన ఈ బ్యూటీకి అలాంటి అవ‌కాశాలు త‌గ్గినా కానీ ఆదాయ మార్గాలేవీ త‌గ్గ‌క‌పోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.
Tags:    

Similar News