ఫోటో స్టోరీ: పోకిరి పాప డెనిమ్ లుక్

Update: 2019-10-25 06:56 GMT
గోవా బ్యూటీ ఇలియానాకు పాపులారిటీ చాలా ఎక్కువ. మహేష్.. పవన్.. ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోల సినిమాల్లో నటించింది కాబట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయినా బాలీవుడ్ లో మాత్రం ఇంకా అవకాశాలు ఉన్నాయి.  త్వరలో ఇల్లీ నటించిన 'పాగల్ పంటి' రిలీజ్ కానుంది. ప్రొఫెషన్ ఇలా ఉంది.. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 'అనుభవించు రాణి' అన్నట్టుగా రెచ్చిపోతోంది.

బ్రేకప్ పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి కానీ రియల్ గా అంత ఘోరంగా ఏం ఉండదు.  బ్రేకప్ ముందు కొన్ని రోజులు.. అయిన వెంటనే కొన్ని రోజులు డిప్రెషన్ కూడా ఉంటుంది.  ఆ దశ దాటిన తర్వాత మరీ దేవదాసు లాంటి బీసీ కాలం మనుషులైతే తప్ప.. బుర్ర ఉండేవారెవారూ బాధపడరు. ప్రస్తుతం ఇల్లీ కూడా అలానే బ్రేకప్ ను వదిలేసి.. ఫుల్ గా రెచ్చిపోతోంది.  ఇన్స్టాలో హాటు బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది.  జిమ్ముకు క్రమం తప్పకుండా వెళ్తూ జీరో సైజుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోంది.  ఇవన్నీ ఒక ఎత్తైతే ఇల్లీ బేబీ కనిపిస్తే చాలు ముంబై మీడియా వారు క్షణాల్లో ఫోటోలు తీస్తారు. రీసెంట్ గా అలానే జరిగింది.

ఇల్లీ బేబీ రీసెంట్ గా ముంబైలో ఒక డబ్బింగ్ స్టూడియో నుంచి బయటకు వస్తూ కనిపించింది. అక్కడే ఇల్లీ ఫోటోలు తీశారు. లూజ్ గా ఉండే బ్లూ జీన్స్ ధరించి.. చిరుగులు ఉండే జీన్స్ షర్టు బటన్లు వదిలేసి మరీ ధరించింది. బ్లాక్ ఇన్నర్ వేర్ కనిపిస్తూ రచ్చ స్టైల్ లో నడుస్తూ వెళ్ళింది. భుజానికి ఒక బ్యాగ్ కూడా తగిలించుకోవడంతో ఆ స్టైల్ మరింతగా పెరిగింది.  ఆ స్మైల్  కూడా సూపర్ గా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఇల్లీ బేబీ ఓ పోకిరి పాపలా కనిపించింది. ఇల్లీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'పాగల్ పంటి' తో పాటు 'ది బిగ్ బుల్' అనే సినిమాలో కూడా నటిస్తోంది.
Tags:    

Similar News