పీరియడ్‌ ఫిలింస్‌తో జాగ్రత్త బాసూ

Update: 2015-07-08 04:23 GMT
ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉన్న ''బాహుబలి'' ఒక పీరియడ్‌ ఫిలిం. 14వ శతాబ్దపు రాజుల కథ. ఇకపోతే ఇదే శతాబ్ధంలో నిజంగా చోటుచేసుకున్న రాణి రుద్రమదేవి కథను కూడా గుణశేఖర్‌ ఒక సినిమాగా తీశాడు. ఇక 1915 వరల్డ్‌ వార్‌ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ కంచె సినిమాను తీస్తున్నాడు. త్వరలో ఇలాంటి పీరియడ్‌ సినిమాలు ఇంకా చాలానే వచ్చే ఛాన్సుంది. అయితే వీటి వలన మన సినిమాల గౌరవం ఎంత పెరుగుతుందో తేడా వస్తే నిర్మాతలకూ అంతే ఇత్తడైపోతుంది.

ఇప్పటికే పీరియడ్‌ సినిమాలు ఈ రేంజులో వస్తున్న నేపథ్యంలో.. రేపు మహేష్‌ బాబు మరో కౌబాయ్‌ సినిమా, రామ్‌చరణ్‌ ఒక రాజుల సినిమా.. ఎన్టీఆర్‌ ఒక మైథలాజికల్‌ ఫిలిం.. ఇలా టాప్‌ స్టార్లందరూ ఈ పీరియడ్‌, పౌరాణికం, హిస్టారికల్‌ సినిమాలు తీయడానికి కంకణం కట్టుకోవచ్చు. కాకపోతే ఇలాంటి సినిమాల్లో ప్రయోగాలు చేయకుండా కథలు కాస్త కమర్షియల్‌గానే ఉంటే బెటర్‌. లేకపోతే అప్పట్లో విక్టరీ వెంకటేష్‌ ''సుభాష్‌ చంద్రబోస్‌'' అనే సినిమాను తీసినట్లే కామెడీగా సినిమా ఫ్లాపవుతుంది. పెద్ద స్టార్ల సినిమాలు అసలే భారీ బడ్జెట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఎంతో వ్యయప్రయాసలు గూర్తి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాలను తయారేచేస్తే మాత్రం కంటెంట్‌తో కాస్త జాగ్రత్తగానే ఉండాలి.

Tags:    

Similar News