ట్రైలర్ టాక్: పెళ్లికి ముందు ప్రేమకథ

Update: 2017-04-29 11:42 GMT
రాజు గారి గది సినిమాలో అమాయకంగా కనిపిస్తూ లాస్టులో విలన్ గా మారిపోయిన కుర్రాడు గుర్తున్నాడా? అతని పేరే చేతన్. ఇప్పుడు మనోడు హీరో అయిపోయాడు. ''పెళ్లికి ముందు ప్రేమకథ'' అనే సినిమాతో వస్తున్నాడు.

దర్శకుడు మధు గోపి రూపొందిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు తెగ ఉన్నాయి. ఇకపోతే అసలు కత ఏంటనేది సినిమా టైటిల్ లోనే అర్దమైపోతుంది. ఇకపోతే టెన్త్ క్లాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన సునయన.. గత పదేళ్ళుగా తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఈ డస్కీ బ్యూటి పెళ్ళికి ముందు ప్రేమకథలో పెళ్ళికి ముందు ప్రేయసి కనిపించనుంది. ట్రైలర్ చూస్తే అటు పవన్ కళ్యాణ్‌ అభిమానులను.. ఇటు బాహుబలి ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ ఫీలయ్యేలా ప్లాన్ చేశారు. పాటల్లో మరో హీరోయిన్ అశ్విని గ్లామర్ కూడా బాగానే ఉంది. చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతోందో.

ఈ సినిమా నుండి బాహుబలై వస్తవ నన్నే మోసుకుపోతావా అంటూ రాసిన ఐటెం సాంగ్ లిరిక్ చాలా ఇంట్రెస్టింగానే ఉంది కాని.. సాంగు ఎంతవరకు క్లిక్ అవుతుందనేది కూడా చూడాల్సిన విషయం. ఒక్కోసారి ఒక్క ఐటెం సాంగ్ క్లిక్ అయినా కూడా.. సినిమాకు మాంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తాయ్.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News