• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లిచూపులు సెన్సేషనల్...

పెళ్లిచూపులు సెన్సేషనల్ రికార్డు

By - Tupaki Desk
Update: 2016-09-15 09:17 GMT
ఒకప్పుడు సినిమాల విజయాల్ని అర్ధశత దినోత్సవం.. శతదినోత్సవం సెంటర్ల లెక్కలతో కొలిచేవాళ్లు. మా హీరో సినిమా ఇన్ని కేంద్రాల్లో వంద రోజులాడింది.. 50 రోజులు ఇన్ని సెంటర్లలో పడ్డాయి అని గొప్పగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు సెంటర్ల సంగతి పక్కకు వెళ్లిపోయి కలెక్షన్ల లెక్కలు మాత్రమే చూస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకునే సినిమాలు కూడా నాలుగు వారాల తర్వాత థియేటర్లలో నిలవట్లేదు. 50 రోజుల పోస్టర్ పడటం చాలా కష్టమైపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే 50 రోజులు ఆడటం అన్నది గగనం అయిపోతుంటే.. ఇక అమెరికా లాంటి చోట్ల 50 రోజులు ఆడటం గురించి మాట్లాడుకోవడం అంటే అతిశయోక్తే అవుతుంది.

కానీ ‘పెళ్లిచూపులు’ సినిమా అమెరికాలో అనూహ్యమైన రికార్డు సాధించింది. అక్కడ ఆ చిత్రం 10 కేంద్రాల్లో యాభై రోజులు ఆడటం విశేషం. జులై 29న విడుదలైన ఈ సినిమా అమెరికాలో అదరగొట్టింది. ఏకంగా మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది. అంతే కాక లాంగ్ రన్ తోనూ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాలకు మించి ఆడవు. ఒక లొకేషన్లో 50 రోజులు ఆడినా ఆశ్చర్యమే. అలాంటిది పది సెంటర్లలో 50 రోజులు ఆడటమంటే మామూలు విషయం కాదు. అమెరికాలో తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ‘పెళ్లిచూపులు’ సినిమానే. పెట్టుబడి మీద 25 రెట్లకు పైగా వసూలు చేసిందీ సినిమా. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ సినిమాను మించిన బ్లాక్ బస్టర్ రావడం కష్టమే.
Tags:    
  • Pelli Choopulu Movie 
  • USA 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS