• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్వారెంటైన్‌ లోనూ పాయల్‌...

క్వారెంటైన్‌ లోనూ పాయల్‌ పాప బిజీ బిజీ

By - Tupaki Desk
Update: 2020-04-24 07:10 GMT
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. సెలబ్రెటీలు ఇంకా ప్రముఖులు కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో కొందరు సెలబ్రెటీలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కొందరు మాత్రం ఈ సమయంలోను పబ్లిసిటీ కోసం లేదంటే ఏదైనా నేర్చుకునేందుకు కేటాయిస్తున్నారు. సెలబ్రెటీలు ఈమద్య ఏదో ఒక ఛాలెంజ్‌ తో బిజీ బిజీగా ఉంటున్నారు. ఆ మద్య పిల్లో ఛాలెంజ్‌ ను చేసిన పాయల్‌ రాజ్‌ పూత్‌ ఆ తర్వాత పేపర్‌ ను డ్రస్‌ మాదిరిగా డిజైన్‌ చేసుకుని దాన్ని ధరించిన విషయం తెల్సిందే. ఈమె పిల్లో ఛాలెంజ్‌.. పేపర్‌ డ్రస్‌ ఛాలెంజ్‌ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కేవలం ఈ పిచ్చి ఛాలెంజ్‌ లు మాత్రమే కాకుండా పనికి వచ్చే పనిని కూడా ఈ అమ్మడు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బ్యూటీ తనకు తాను యాక్టింగ్‌ విత్‌ బ్యూటీ అనుకుంటూ ఉంటుంది. మాస్‌ ఆడియన్స్‌ లో తనకు మంచి క్రేజ్‌ ఉంది కాని తెలుగు రాని కారణంగా టాలీవుడ్‌ లో రాణించలేక పోతున్నట్లుగా భావిస్తుంది. అందుకే ఈ క్వారెంటైన్‌ టైంను తెలుగు నేర్చుకునేందుకు కేటాయించాలనే నిర్ణయానికి ఈ అమ్మడు వచ్చిందట.

ప్రస్తుతం ఆన్‌ లైన్‌ ద్వారా తెలుగును నేర్చుకునే పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు వస్తే హీరోయిన్‌ గా టాలీవుడ్‌ లో దున్నేయవచ్చు అనేది అమ్మడి ఆలోచనగా తెలుస్తోంది. ఈ లాక్‌ డౌన్‌ పీరియడ్‌ అయ్యే లోపు తెలుగు నేర్చుకుని తెలుగు సినిమాల్లో నటించాలని కోరుకుంటుంది. కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ లాక్‌ డౌన్‌ కారణంగా చాలా వరకు సినిమాల నిర్మాణం తగ్గి పోతాయి. కనుక ఈ అమ్మడికి అసలు ఆఫర్లు వస్తాయా లేదా అనేది అనుమానమే. ఈ క్వారెంటైన్‌ లో కూడా ఏదో ఒక ఛాలెంజ్‌ తోనో తెలుగు నేర్చుకుంటూనో ఈ అమ్మడు బిజీగా అయితే ఉంది. మరి లాక్‌ డౌన్‌ తర్వాత పరిస్థితి ఏంటీ అనేది మాత్రం సస్పెన్స్‌  గా మారింది.
Tags:    
  • Payal Rajput Paper Dress 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

Copyright @2026

Powered by Blink CMS