పవన్ సీఎం కోరిక.. ఇలా తీరబోతుంది.!

Update: 2020-03-14 11:03 GMT
రాజకీయాల్లో అధికారమే లక్ష్యంగా దూసుకొచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టి ఏపీ రాజకీయ యవనికపై తిరుగులేని నేతగా ఎదుగుదామని అనుకున్నారు. కానీ పవన్ ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచారు. ఆయనకు రాజకీయం కంటే సినిమా ఇజమే బెటర్ అని మళ్లీ సినిమాల బాటపట్టించారు.

పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమితో పవన్ కళ్యాణ్ కు ఫుల్ సినిమా కనపడింది. సినిమాలను వదిలేసి వచ్చిన పవన్ ను రెండు చోట్ల స్వయంగా ఓడించారు జనాలు. దీంతో తత్త్వం బోధపడి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పవన్. ప్రస్తుతం రెండు సినిమాలు పట్టాలెక్కించి చేసుకుంటూ పోతున్నారు.

అయితే తాజాగా మరో సినిమాకు కమిట్ అయ్యాడట పవన్ కళ్యాణ్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమాకు ఓకే చెప్పాట..  పూరితో ఇదివరకే రెండు సినిమాలు చేసిన పవన్ కు ఇది మూడోది. రీఎంట్రీలో వరుసగా వేగంగా సినిమాలు తీస్తున్న పవన్ తాజాగా పూరి  సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

నిజజీవితంలో ముఖ్యమంత్రి కాలేని పవర్ స్టార్ ని తన సినిమా ద్వారా సీఎం చేస్తానని.. ఆ కోరికను తీరుస్తానని అంటున్నాడు పూరి జగన్నాథ్. అవును పూరి తాజాగా పవన్ తో తీసే సినిమాలో  సీఎం అయ్యే కథనాయకుడి పాత్రనే పవన్  కోసం తీర్చిదిద్దాడట..  

అప్పట్లో మహేష్ బాబుతో ‘జనగణమన’ ప్రకటించిన పూరి ఆ సినిమాను పట్టాలెక్కించలేదు. మహేషే కథ నచ్చక వైదొలగడానే టాక్ వచ్చింది. ఇప్పుడు అదే కథను పవన్ తో తీస్తున్నట్టు సమాచారం. ఈ జనగణమనలో పవన్ సీఎం అవ్వబోతున్నాట..  ఇలా నిజజీవితంలో సీఎం ముచ్చట తీర్చుకోలేని పవన్ కు కనీసం సినిమాల్లోనైనా ఆ దాహం తీర్చడానికి దర్శకుడు పూరి రెడీ అవుతున్నాట..  ఈ సినిమాపై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి మరీ.
Tags:    

Similar News