• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని...

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న దిల్ రాజు

By - Tupaki Desk
Update: 2020-03-19 05:53 GMT
రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ' వకీల్ సాబ్'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఒక పాట కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా విశేష స్పందన లభించింది. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న ఈ చిత్రం మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూవుంది. వివరాల్లోకి వెళ్తే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చడం లేదంట.

అదేంటంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటింప చేయడానికి నటి లావణ్య త్రిపాఠితో దిల్ రాజు చర్చలు జరుపుతున్నారని సమాచారం. 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి జోష్ లో ఉన్న లావణ్య త్రిపాఠీని హీరోయిన్ గా తీసుకోవడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దిల్ రాజు సెలెక్టన్ పై మెగా అభిమానులు సంతోషంగా లేరని, ఈ విషయం కొందరు అభిమానులు స్వయంగా దిల్ రాజుని కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేసారని ఇండస్ట్రీ లో చర్చించుకుంటున్నారు. మరి ఇప్పుడు దిల్ రాజు లావణ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ మంచి హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Tags:    
  • Vakeel Saab First Look 
  • Vakeel Saab 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Vakeel Saab Distributors 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS