ఖైదీ టిప్స్ కాటమరాయుడు మిస్సయ్యాడు

Update: 2017-03-27 08:09 GMT
అసలు ఊహించనంత హైప్ వచ్చింది. ఎవ్వరూ అనుకోని రేంజు రేట్లకు సినిమాను అమ్మేశారు. ఒక రీమేక్ సినిమాకు 85 కోట్లు బిజినెస్ జరగడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ''కాటమరాయుడు'' సినిమా ఎలా ఉండబోతోంది అంటూ సర్వత్రా ఉత్కంఠ ఉంది. కాని రిలీజ్ రోజును రెండవ ఆటకే సినిమాలో సీన్ లేదంటూ టాక్ బయటకొచ్చింది. ఇక తొలిరోజు కలక్షన్లు టాప్ 5 టేబుల్లో ఉన్నా కూడా.. రెండో రోజు మాత్రం ఘోరంగా పడిపోయాయ్. అసలు పవన్ కళ్యాణ్‌ క్రేజ్ కాటమరాయుడును ఎందుకు కాపాడలేకపోయింది? వాట్ వెంట్ రాంగ్? ఈ విషయంలో ఒక్కసారి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి పవన్ కొన్ని విషయాలు నేర్చుకోవాలి అంటున్నారు సినిమా లవర్స్.

నిజానికి కాటమరాయుడు మొదటి హాఫ్‌ బాగానే ఉంది కాని.. ద్వితీయార్దంలో మాత్రం కావల్సినంత కిక్ లేదు. హీరోను ఎలివేట్ చేయడంలో దర్శకుడు కాస్త విఫలమయ్యాడనే చెప్పాలి. అసలే రొటీన్ కథ.. కథనం అయినప్పుడు.. ఎలివేషన్ సీన్లు అదిరిపోవాలి. మరి పవన్ ఒక ప్రక్కన వేమారెడ్డి.. సాయిమాధవ్ బుర్రా వంటి రైటర్లతో రాయించేసి.. డాలీతో తీయించేసినా కూడా.. అవి క్లిక్కవ్వలేదు. సో.. దర్శకుడ్ని సరిగ్గా ఎంచుకోవాలి అనే విషయం పవన్ తెలుసుకోవాలేమో. రీమేక్ సినిమాయే కదా అని చిరంజీవి తన ఖైదీ నెం 150కు వివి వినాయక్ ను పెట్టుకోకుండా ఉంటే.. ఆ మాత్రం ఎలివేషన్ సీన్లు పడేవి కాదు.

ఇకపోతే పవన్ వంటి స్టార్ల సినిమాలకు ఎప్పుడూ కూడా పాటలు చాలా ముఖ్యం. ఈ సినిమాకు ముందులో తమన్.. తరువాత దేవిశ్రీ ను అనుకుని కూడా.. చివరకు అనూప్ రూబెన్స్ చేతిలో పెట్టేశారు. అనుభవ రాహిత్యం అనండి.. లేదంటే పెద్ద హీరో ఇమేజ్ ను అర్ధం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అనండి.. లేదంటే మెలోడీలకే పరిమతమైన తనకు మాస్ మ్యూజిక్ పల్స్ తెలియదని చెప్పండి.. అనూప్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక్కడ పవన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. పాటలు హిట్టయ్యేలా చూసుకోకపోవడం అనేది ఆయన ఫెయిల్యూర్ కూడా. అలాగే పాటలను కూడా చివర్లో ఓ వారంలో తీసేస్తే అవి కాటమరాయుడు పాటల్లా ఉంటాయి. ఒక స్టెప్ లేదు.. ఒక మూడ్ లేదు.. ఒక వెరైటీ వేరియేషన్ లేదు. అదే చిరంజీవి తన ఖైదీ పాటలకు.. ప్రత్యేకమైన దుస్తుల నుండి డిఫరెంట్ డ్యాన్సు స్టెప్పుల వరకు ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా చూసుకున్నారు. ఆ విషయం పవన్ కూడా తెలుసుకోవాల్సిందే.

ఈ విధంగా చూస్తే పవన్ కు ఖైదీ మరో టిప్ కూడా ఇచ్చాడు. అదేంటంటే.. అసలు సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా.. సినిమాను విపరీతంగా ప్రమోషన్ చేయాల్సిందే. ఆ విషయంలో చిరంజీవి పెద్ద పెద్ద టివి ఛానల్స్ నుండి చిన్న చిన్న న్యూస్ పేపర్ల వరకు.. అందరికీ ఇంటర్యూలు ఇచ్చారు. వెబ్ సైట్ల నుండి యుట్యూబ్ ఛానళ్ళలో కూడా ఆయన ఇంటర్యూలు కనిపించాయి. అలాగే కాజల్.. రామ్ చరణ్‌.. వినాయక్.. దేవిశ్రీప్రసాద్ కూడా తెగ ప్రమోట్ చేశారు. కాని కాటమ విషయంలో పవన్ తో పాటే శృతి హాసన్ తదితరులు కూడా ముఖం చాటేశారు. అసలు పెద్దగా ఫేం లేని తమ్ముళ్ళు పాత్రలను పోషించిన నటులు ప్రమోట్ చేసినంత మాత్రాన ఈ సినిమాకు సరిపోతుందా? సరిపోలేదు.
4

మొత్తంగా యావరేజ్ అనిపించిన ఖైదీ నెం 150 ను బ్లాక్ బస్టర్ చేసిన ఘనత చిరంజీవికి దక్కితే.. అటువంటి మరో యావరేజ్ సినిమాను హిట్ చేయలేకపోయిన క్రెడిట్ పవన్ మూటకట్టుకుంటున్నాడు. ఒకవేళ ఖైదీ ఇచ్చిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యుంటే ఖచ్చితంగా కాటమరాయుడు కు ప్లస్ అయ్యేదేమో.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News