పవన్ కి 60 రోజులకు 40 కోట్లా?

Update: 2017-06-23 05:47 GMT
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు అభిమానులను డిజప్పాయింట్ చేసింది. తొలి రోజు నుంచే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ పవర్ స్టార్ కి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ కారణంగా.. ఈ సినిమాకి టాక్ ఎలా ఉన్నా 63 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేసేస్తున్నాడు పవన్.

దీని తర్వాత పవన్ చేయబోయే సినిమాపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. నిజానికి ఏఎం రత్నం నిర్మాణంలో.. తమిళ దర్శకుడు ఆర్టీ నీసన్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తాడని ముందు నుంచి భావించినా.. పవన్ మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ చేయనున్న సినిమాకే మొగ్గాడట. ఇందుకు కమర్షియల్ కమిట్మెంట్స్ కారణంగా చెబుతున్నారు. కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి.. పవన్ కేవలం 60 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇవ్వనున్నాడట. అయితే.. ఈ 60 రోజుల కాల్షీట్స్ కు గాను.. పవన్ కు 40 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు మైత్రీ మూవీస్ బ్యానర్ సిద్ధపడ్డంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలిందని తెలుస్తోంది.

2019 ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. వీలైనంత త్వరగా కాసిన్ని సినిమాలు చేసేసి ఫండ్స్ కూడబెట్టాలన్నది పవన్ యోచన. పార్టీ ఫండ్స్ సేకరిస్తే.. వారి ఒత్తిడి ఫేస్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో.. ఇప్పటివరకూ జనసేన పార్టీని తన సొంత డబ్బులతోనే పవన్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News