ఆ ఛానల్లో పవన్ ఫ్యాన్స్ ఏం చేశారు?

Update: 2017-03-27 11:32 GMT
ఒక లోకల్ ఛానల్ లో జరిగిన రచ్చ ఇప్పుడు పెద్ద డిస్కషన్లకు కేంద్ర బింధువు అయ్యింది. రాను రానూ ఫ్యాన్స్ అనేవారు చాలా హింసాత్మకంగా తయారవుతున్నారంటూ ఆ ఇన్సిడెంట్ చూపిస్తూ అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అక్కడ పవన్ కళ్యాణ్‌ అభిమానులు ''కాటమరాయుడు'' రిలీజ్ నాడు ఏం చేశారో చూద్దాం పదండి.

అసలు కాటమరాయుడు సినిమా ఎలా ఉందో పబ్లిక్ కు చెప్పడానికి కేవలం ఒక యాంకర్ కమ్ క్రిటిక్ తో వీడియో రివ్యూ చెప్పించడమే కాదు.. ఆ కార్యక్రమానికి కొందరు సో కాల్డ్ పవన్ అభిమానులను కూడా ఇన్వయిట్ చేశారు. ఇక ఈ సినిమాకు 3 స్టార్లు రేటింగ్ ఇస్తున్నాను అని చెప్పగానే.. మమ్మల్ని స్టూడియోకు పిలిచి మరీ ఇలా 3 అని డిసైడ్ చేస్తావా అంటూ అక్కడికి వచ్చిన అభిమానులు రెచ్చిపోయి.. వాటర్ బాటిళ్లను నేలకేసి కొట్టేసి.. నానా రచ్చ చేశారు. అసలు పవన్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటున్న వీరు నిజంగానే పవన్ ఫ్యాన్ ఆర్గనైజేషన్ల మెంబర్లో కాదో తెలియదు కాని.. ఇలా లైవ్ లో రచ్చ చేస్తే మాత్రం మచ్చ పవన్ కళ్యాణ్‌ కు వస్తుంది అని గ్రహించాలి గురూ. అసలు 3 రేటింగ్ ఇస్తేనే ఇలాంటి హడావుడి చేశారంటే.. ఒకవేళ 2.5 అని చెప్పుంటే ఏం చేశేవారో!!

ఇకపోతే అక్కడ గొడవ జరుగుతున్న తీరు చూస్తే.. ఇదేదో రేటింగులు కోసం సదరు ఛానల్ వారే కావాలని గొడవ చేయించినట్లు ఉంది. ఆ గొడవలో నిజంగా ఎమోషన్ తో రియాక్ట్ అయినట్లు కాకుండా.. అందరికీ స్ర్కిప్టు ముందే ఇచ్చారన్నట్లు ఉంది వారి యాక్షన్. వీడియోను చూసినవారు ఈ విధంగా కామెంట్లు చేయడం గమనార్హం.


Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News