కేసు ఎందుకు వెనక్కి.. వర్మ భయపడ్డారా?
ఎవరు గాజులు తొడుక్కున్నారన్నది కాదన్నయ్యా.. ఎవరు పోలీస్ కేసు పెట్టారు? ఫ్యాన్ వార్ నడిపించారు? అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ. పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్సెస్ ఆర్జీవీ ఎపిసోడ్స్ పరాకాష్టకు చేరుకున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ట్రైలర్ రిలీజైంది మొదలు పవన్ అభిమానులు ఆర్జీవీపై మంట మీద ఉన్నారని నిన్నటి దాడి ప్రూవ్ చేసింది. అయినా ఆర్జీవీ ఎక్కడా తగ్గడం లేదు సరి కదా.. వరుస మీడియా మీటింగులతో ప్రచారం హోరెత్తించేస్తున్నాడు. పవన్ అభిమానులు దాడి చేసి ఆర్జీవీ సినిమా పవర్ స్టార్ కి అనవసరంగా మైలేజ్ పెంచారని భావిస్తున్నారు.
ఆర్జీవీ ఆఫీసుపై అసలు దాడి చేయడమే తప్పిదం అన్న సూచన జనంలోంచి కనిపిస్తోంది. అనవసరంగా ఆర్జీవీ లాంటి ఫ్రీ పబ్లిసిటీ స్టంట్ మన్ కి అవకాశం ఇవ్వడమేనని అంతా భావిస్తున్నారు. ఒక మాటకు కట్టుబడని ఊసరవెల్లి ఆర్జీవీకి అనవసరంగా ఇమేజ్ పెంచారు గా అంటూ పబ్లిక్ మాట్లాడుకోవడం చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. అసలు నేను పవర్ స్టార్ సినిమాని పవన్ కల్యాణ్ పై తీయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్న ఆర్జీవీ నిన్న తన ఆఫీస్ పై దాడి చేసిన పవన్ అభిమానులపై పోలీస్ కేసు పెట్టడం ఆ వెంటనే కాసేపటికి ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
వర్మ ఆఫీస్ పై దాడి అంటూ జరిగిన ప్రచారంతో పాటే పవర్ స్టార్ మూవీ రిలీజ్ ప్రచారం చేసుకున్నాడు ఆర్జీవీ. మీడియాల్లో గడపగడపకు వెళ్లి మరీ పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే ఆ ఎనిమిది మందిని పోలీసులు విడిచి పెట్టేశారు. అయితే అలా ఎందుకు జరిగింది? అంటే.. ఆర్జీవీ తాను జూబ్లీ పీఎస్ లో నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకున్నారట. ఓవైపు ట్వీట్లతో మంట పెడతాడు. పవన్ అభిమానుల్ని రెచ్చగొడతాడు. మరోవైపు దాడికి దిగితే పోలీసు కేసులు అంటాడు. అంతలోనే వెనక్కి తీసుకుంటాడు. ఇదంతా దేనికి? అంటే.. కేవలం పవర్ స్టార్ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ కోసమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అతడికి పవన్ పై కానీ ఆయన అభిమానులపై కానీ పగ ప్రతీకారం ఏదీ లేదు. కేవలం సినిమా తీసి డబ్బు సంపాదించడం ఒక్కటే ఉద్ధేశం. ఒక రకంగా పరాన్నజీవి లక్షణమే ఇది అంటూ సెటైర్లు పడుతున్నాయి.
``నేను పవన్ కళ్యాణ్ పై సినిమా తీసి ఉండకపోవచ్చు. కానీ ఆ సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతారు`` అంటూ రెచ్చగొట్టడం ఆయనకే చెల్లింది. నమ్మకం లేకపోతే సినిమా చూసిన తరువాత మాట్లాడండి అంటూ వర్మ అనడాన్ని బట్టి కెలకడం ద్వారా సంపాదనకు అలవాటు పడ్డాడనేగా దీనర్థం.