• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ క్రేజీ...

పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ అటకెక్కిందా..?

By - Tupaki Desk
Update: 2022-11-01 10:31 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో "భవదీయుడు భగత్ సింగ్" అనే చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరి కలయికలో మరో సినిమా అనేసరికి అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా పక్కన పెట్టేశారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా #PSPK28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసారు. 'ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు' అంటూ కాన్సెప్ట్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఏ సినిమా టైటిల్ పై రోజుకో వార్త వస్తున్న నేపథ్యంలో.. గతేడాది "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ అనౌన్స్ చేసి పవన్ ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసారు.

'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని పేర్కొన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ సినిమాకు అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నట్లు తెలిపారు. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తారని పోస్టర్ లో వెల్లడించారు.

అయితే నెలలు గడుస్తున్నాయి కానీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కలేదు. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతా క్రమం ఎప్పటికప్పుడు మారుతూ వస్తుండటంతో.. PSPK28 నంబర్ కూడా మారుతూ వస్తోంది. ఈ క్రమంలో అనౌన్స్ మెంట్ కే అపరిమితమైన ఈ BBS సినిమాకు సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే వస్తున్నాయి.. మేకర్స్ వీటిపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని ధృవీకరించారు. అలానే 'మీర్జాపూర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి మరియు కమెడియన్ సత్య కూడా ఈ మూవీలో భాగం అవుతారని పేర్కొన్నారు. అయినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడలేదు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని.. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాతలు గతేడాది సెప్టెంబర్ లో వెల్లడించారు. 'భీమ్లా నాయక్' చివరి దశలో ఉండగా.. 'హరి హర వీరమల్లు' చిత్ర షూటింగ్ తిరిగి సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ సినిమా మొదలవుతుందని.. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. అయితే ఇది జరిగి ఏడాది గడిచినా.. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

అయితే భవదీయుడు సినిమా ఆగిపోయిందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నందున, ఈ సినిమా ముందుకు సాగే పరిస్థితి లేదని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం పీకే ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఎందుకంటే తమ హీరో రీమేక్స్ చేయడం కంటే హరీష్ తో ఒరిజినల్ మూవీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి కూడా మరో బ్లాక్ బస్టర్ ఇస్తారని బలంగా నమ్ముతున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. 'గద్దల కొండ గణేష్' తర్వాత మరో సినిమా చేయకుండా.. పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా అటకెక్కిందనే పుకార్లు వచ్చాయి. మరి రాబోయే రోజుల్లో 'గబ్బర్ సింగ్' దర్శకుడు ఈ రూమర్స్ ని క్లియర్ చేస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • PawanKalyan 
  • HarishShankar 
  • CrazyProject 
  • Shelved 
  • Rumours 
  • Tollywood 
  • Commercial 
  • LatestNews 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

Copyright @2026

Powered by Blink CMS