• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వకీల్ సాబ్' షూటింగ్...

'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..!

By - Tupaki Desk
Update: 2020-12-29 17:35 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. హిందీ హిట్ మూవీ 'పింక్‌' కి రీమేక్‌ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ తో కలిసి పవన్‌ కల్యాణ్ దిగిన ఫొటోలను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఒక ఫొటోలో పవన్ దర్శకుడు వేణు శ్రీరామ్ ని నవ్వుతూ హగ్ చేసుకుని కనిపిస్తున్నాడు. అలానే మరో ఫొటోలో టీమ్ మొత్తం కనిపిస్తోంది.

కాగా, 'వకీల్ సాబ్' చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. పవన్ కి జోడీగా శృతి హాసన్ నటించింది. ఈ చిత్రంలో నివేధా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. 'వకీల్ సాబ్' చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త సంత్సరం సందర్భంగా జనవరి 1న ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
Tags:    
  • Pawan Kalyan 
  • Dil Raju 
  • Vakeel Saab 
  • Powerstar 
  • Pink Remake 
  • Dil Raju Upcoming Movies 
  • Tollywood Movies 
  • Vthemovie 

Similar News

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

Copyright @2026

Powered by Blink CMS