ఖరీదైన కారు బుక్ చేసిన పవన్ కళ్యాణ్..!

Update: 2021-07-01 02:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు వీలైనన్ని సినిమాలు చేయాలని ఫిక్స్ అయిన పవన్.. రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఒక్కో సినిమాకి సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సినిమాలు చేస్తున్నట్లు హింట్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

సెలబ్రిటీలు తమ స్టేటస్ కు తగ్గట్టుగా లగ్జరీ కార్లల్లో తిరుగుతుంటారు. కానీ పవన్ మాత్రం ఎప్పుడూ వాటిపై పెద్దగా మోజు పడినట్లు అనిపించదు. గత ఆరేళ్ళ నుంచి ఆయన పాత కారునే ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ఖరీదైన కారును బుక్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ - ఆటోబయోగ్రఫీ మోడల్ కారును పవన్ పేరు మీద బుక్ చేసినట్లుగా తెలిసింది. షారుఖ్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ - రణబీర్ కపూర్‌ - ప్రభాస్ వంటి హీరోల దగ్గర ఇలాంటి మోడల్ కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు పవన్ కూడా చేరిపోనున్నాడు. పవన్ తన ఫ్యామిలీ కోసం పర్సనల్ అవసరాల కోసం ఈ కారుని కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News