• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షూటింగ్ లో ప‌వ‌న్ కు...

షూటింగ్ లో ప‌వ‌న్ కు గాయం?

By - Tupaki Desk
Update: 2017-10-21 10:06 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 25 వ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ దాదాపు ఖ‌రారైన‌ట్లే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ ...జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌బోతోన్న నేప‌థ్యంలో చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్రస్తుతం  కర్ణాటక - చిక్ మంగుళూరు ప్రాంతాల‌లో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్‌ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కోసం కీలకమైన యాక్షన్ పార్ట్ ను అక్క‌డ‌ చిత్రీకరించార‌ట‌. పవన్ ఫ్యాన్స్ కోసం ప్ర‌త్యేకంగా ఈ ఫైట్స్ ను త్రివిక్రమ్ డిజైన్ చేయించినట్టు సమాచారం.

ప‌వ‌న్‌ - త్రివిక్ర‌మ్ ల కాంబోలో తెర‌కెక్కిన జ‌ల్సా - అత్తారింటికి దారేది చిత్రాల‌లో ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. అదే త‌ర‌హాలో  ఈ సినిమాలో కూడా అద్భుత‌మైన‌ యాక్షన్ ఎపిసోడ్ ను త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ యాక్ష‌న్ పార్ట్ సంద‌ర్భంగా పవన్ చేతికి గాయమైన‌ట్లు స‌మాచారం. అయినా దానిని లెక్కచేయకుండగా ప‌వ‌న్ షూటింగులో పాల్గొంటున్నాడట‌. హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు త్రివిక్రమ్ ...ఈ సినిమాపై ప్ర‌త్యేక‌ శ్రద్ధ తీసుకుంటున్నాడట‌. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ విదేశాలలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న‌ కీర్తి సురేశ్ - అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ  సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.      
Tags:    
  • Pawan kalyan 
  • Agnathavasam 
  • PSPK25 
  • TELugu NEWs 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS