పవన్‌ చేతి 'జనగనమణ' పాడించనున్న పూరి?

Update: 2020-12-08 04:30 GMT
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ మదిలో చాలా ఏళ్లుగా ఉన్న జనగనమణ సినిమాను మహేష్‌ బాబుతో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఆమద్య ఒక పోస్టర్‌ ను కూడా విడుదల చేశాడు. కాని ఇప్పుడు ఆ సినిమాను మరో హీరో వద్దకు తీసుకు వెళ్లే విషయమై పూరి ఆలోచించాడు అంటూ ప్రచారం జరుగుతోంది. మీడియా సర్కిల్స్‌ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అదే కథను పవన్‌ వద్దకు పూరి తీసుకు వెళ్లాడట. అవినీతి భారతంపై సాగే ఈ కథలో మంచి దేశ భక్తి ఎలిమెంట్స్‌ ఉన్నాయి. అందుకే ఈ సినిమాను పవన్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో పూరి ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పవన్‌ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవన్ని కూడా పూర్తి అయితే తప్ప కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అంటే పూరి.. పవన్‌ ల కాంబో మూవీ పట్టాలెక్కాలంటే 2022 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమా షూటింగ్‌ లో ఉన్న పవన్‌ ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఆ తర్వాత హరీష్‌ శంకర్‌, సురేందర్‌ రెడ్డి మరియు సాగర్‌ చంద్ర దర్శకత్వంలో కూడా నటించాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాత పూరితో పవన్‌ మూవీ ఉంటుందా లేదా ముందే పూరికి డేట్లు ఇస్తాడా అనేది చూడాలి. మహేష్‌ కోసం రెడీ చేసిన ఆ స్టోరీ లైన్‌ పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్లడంపై ఇద్దరు హీరోల అభిమానులు ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది.
Tags:    

Similar News