మునీశ్వరుడిలాగా మారిపోయారు.. ఏమిటి చెప్మా?
ఏజ్ ని గేజ్ ని దాచాల్సిన అవసరం ఏం ఉంది? అయినా ఏజ్ తో పాటే మనిషి ప్రవర్తనలోనూ మార్పు రావాలనే అంతా కోరుకుంటారు. ఈ విషయంలో మన సీనియర్ హీరోలు మాత్రం భేషజానికి పోతుంటారు. చాలా మంది తమ వయసును దాచేస్తుంటారు. జుత్తుకు రంగు.. అవసరం అనుకుంటే విగ్గు ధరిస్తుంటారు. కానీ ఇక్కడ అదీ లేదు ఇదీ లేదు. అసలు ఏదీ వద్దు! అన్నట్టుగానే ఉంది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యవహారం. తనని సహజంగా ఆవిష్కరించుకునేందుకే ఆయన ఆసక్తిగా ఉన్నారు. జనం తన గురించి ఏమనుకుంటారో అనే బెంగ ఆయనలో అస్సలు కనిపించడమే లేదు.
తాజాగా రివీలైన పవన్ ఫోటో చూశాక అభిమానులు ఇలానే అనుకుంటున్నారు. ఓవైపు వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉండగా.. మరోవైపు వరుసగా నాలుగైదు చిత్రాల్లో నటించాల్సి ఉండగా.. ఆయన ఇలా కనిపిస్తున్నారేమిటి? మునీశ్వరుడిలాగా మారిపోయారు ఏమిటి చెప్మా? అంటూ గుసగుసగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది.
ఈనెల 25 నుంచి `వకీల్ సాబ్` షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు. ఇంతకీ వకీల్ సాబ్ గెటప్పేనా ఇది? మాసిన గడ్డం.. పండిన తల వెంట్రుకలు షాకిస్తున్నాయిగా...లుక్ మార్చరా? మునీశ్వరుడిలా ఏదీ పట్టించుకోరా వకీల్ సాబ్? అని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.