• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పోకిరి' ని బీట్...

'పోకిరి' ని బీట్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ ప్లాన్స్..?

By - Tupaki Desk
Update: 2022-08-04 03:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను వారి అభిమానులు ఎంత ఘనంగా సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో భాగంగా తమ అభిమాన హీరోల కెరీర్లో క్లాసిక్స్ మరియు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ ఉంటారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ - విజయవాడ - వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో స్పెషల్ షోలు వేస్తుంటారు. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా బ్లాక్ బస్టర్ 'పోకిరి' సినిమా షోలను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

'పోకిరి' 4కె ప్రింట్ తో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ స్పెషల్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ షోలకు సంబంధించిన టికెట్లు సేల్ కు పెడితే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఏదో కొత్త సినిమా రిలీజ్ అనే రేంజ్ లో రెస్పాన్స్ కనిపిస్తోంది.

నిజానికి మహేష్ బర్త్‌ డేకి పది రోజుల ముందే రాజమండ్రిలో 'ఒక్కడు' స్పెషల్ షోతో సంబరాలు మొదలుపెట్టేశారు. ఆ షోకి వచ్చిన స్పందన చూసి అందరూ అవాక్కయ్యారు. ఇప్పుడు 'పోకిరి' మ్యానియా చూస్తుంటే అంతకుమించిన హంగామా గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంటున్నారు.

'పోకిరి' స్పెషల్ షోల క్రేజ్ చూసిన తర్వాత.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం స్పెషల్ షోల ప్రదర్శనకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. దీన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని.. సెప్టెంబర్ 2న తమ అభిమాన హీరో నటించిన 'జల్సా' సినిమా ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

'జల్సా' అనేది పవన్ కళ్యాణ్ కెరీర్ లో స్పెషల్ మూవీ. 'ఖుషీ' తర్వాత ఎన్నో ఏళ్లకు దక్కిన హిట్ కావడంతో.. అభిమానులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. అందుకే పవర్ స్టార్ బర్త్ డేకి షోలు వేయాలని చూస్తున్నారు. గీతా ఆర్ట్స్ ని 4కే ప్రింట్ అందించమని కోరుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'పోకిరి' షోలను బీట్ చేయాలని అనుకుంటున్నారట.

మరికొందరు మాత్రం 'గుడుంబా శంకర్' మూవీ ప్రింట్ అందించమని సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. నిజానికి గతేడాది 'గబ్బర్ సింగ్' కోసం నిర్మాత బండ్ల గణేష్ 100 షోలను ప్లాన్ చేసాడు. అయితే తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా 6 షోలు మాత్రమే ప్రదర్శించగా.. అందులో ఒకటీ రెండు షోలు మాత్రమే హౌస్‌ ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. మరి ఈసారి 'జల్సా' చిత్రాన్ని ప్రదర్శిస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆగస్ట్ 29న స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతీ ఏడాది నాగ్ నటించిన సినిమాలని అక్కినేని అభిమానులు స్పెషల్ గా ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈసారి వైజాగ్‌ లో 'రక్షకుడు' స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Tags:    
  • Tollywood 
  • powerstar 
  • pawanklayan 
  • superstar 
  • maheshbabu 
  • poliri 
  • jalsa 
  • latestnews 

Similar News

ఎన్టీఆర్‌ డ్రాగన్ షూట్‌ ఇంకా ఎంత కాలం..?

2026-11-13 22:30 GMT

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

Copyright @2026

Powered by Blink CMS