మెగా సినిమాలపై పవన్ ట్వీట్లేస్తాడా?

Update: 2017-11-27 05:05 GMT
పవన్ కళ్యాణ్ కొత్తగా ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించాడు. అదేంటీ.. పవన్ కు ఇప్పటికే ఓ సొంత ట్విట్టర్ ఖాతా ఉంది కదా.. మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ కూడా ఉన్నారు కదా అనుకోవచ్చు. అది కరెక్టే కానీ.. పవన్ ఆ అకౌంట్ ను తన రాజకీయ పార్టీ అయిన జనసేన కోసం.. సామాజిక అవసరాల కోసమే వినియోగిస్తున్నాడు. తన సినిమాల గురించి కూడా ట్వీట్స్ అందులో కనిపించవు.

అందుకే ఇప్పుడు పీకే క్రియేటివ్ వర్క్స్ అంటూ తన బ్యానర్ పేరుపై మరో ట్విట్టర్ హ్యాండిల్ ను ప్రారంభించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ ని నవంబర్ 27న రిలీజ్ చేస్తామని ఇప్పటికే చెప్పిన పవన్ కళ్యాణ్.. దానికి కొంచెం ముందు ఇలా ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడం అంటే.. మూవీ ప్రమోషన్స్ కోసం అనే విషయం అర్ధమవుతూనే ఉంది. అయితే.. పవర్ స్టార్ మూవీ టైటిల్ అని ప్రచారంలో ఉన్న అజ్ఞాతవాసితో పాటు తన ఇతర చిత్రాల ప్రచారానికే దీన్ని ఉపయోగిస్తాడా.. లేక ఇతర సినిమాల అప్ డేట్స్ కూడా ఉంటాయా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మెగాస్టార్ మూవీ సైరా నరసింహారెడ్డి.. రామ్ చరణ్ రంగస్థలం సెట్స్ పై ఉండగా.. తేజు నటించిన జవాన్ డిసెంబర్ 1న విడుల కానుంది. అలాగే నితిన్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు కూడా పవన్ సపోర్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు సినిమాల కోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కొత్త సోషల్ మీడియా పేజ్ లో అనేక మూవీ అప్ డేట్స్.. ఆయా సినిమాలపై పవన్ ఒపీనియన్స్ ను నేరుగా తెలుసుకోవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కొత్త సినిమాలపై అఫీషియల్ న్యూస్ అందుతున్నది వారి ఆనందానికి అసలు కారణంగా చెప్పచ్చు.
Tags:    

Similar News