రెజీనాతో కలిసి సండే పార్టీకి ఛాన్స్!!
కొందరు అందాల భామలు సినిమాల్లో ఎంత అందంగా కనిపిస్తుంటారో.. అంత కంటే అందమైన మనసు తమకు ఉందని చాటి చెబుతున్నారు. ఛారిటీల విషయంలో కొందరు ఓపెన్ గాను.. మరికొందరు గుప్తదానాలు చేసేస్తుంటారు. కానీ రెజీనా కసాండ్రా మాత్రం ఓ కొత్త కాన్సెప్ట్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తోంది.
రెజీనా కసాండ్రాతో సండే రోజున పార్టీ అంటే ఎవరు వద్దనగలరు? ఈ నెల 31న జరిగే ఓ పార్టీకి రెజీనా ఆహ్వానం పలుకుతోంది. అయితే.. సరదా కోసం చేసుకుంటున్న పార్టీ కాదు. ఓ నిస్సహాయ చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన పార్టీ. దీని గురించి రెజీనా స్వయంగా వివరించి మరీ ఆహ్వానించింది. ' లైఫ్ ఈజ్ ఏ బాల్ - టీచ్ ఫర్ ఛేంజ్ - ఆదిత్య మెహతా ఫౌండేషన్ లంటే నాకు చాలా ఇష్టం. వారు సమాజానికి చేస్తున్న సేవలు అద్భుతం. వారికి సాయం చేసేందుకు ఏదైనా చేద్దామని అనిపించింది. అందుకే ఓ సన్ డౌనర్ ఏర్పాటు చేశాం' అని చెప్పింది రెజీనా.
'ది గ్రేట్ ఫ్యాన్ డాట్ కామ్ సంస్థతో కలిసి సన్ డౌనర్ చేస్తున్నాం. సన్ డౌనర్ అంటే ఓ గెట్ టుగెదర్ లాంటిది. ఇక్కడ నేనే డీజే. రండి సండే ఈవెనింగ్ ఎంజాయ్ చేసేద్దాం - పార్టీ చేసుకుందాం' అంటూ ఆహ్వానం పలికింది. అయితే.. ఈ పార్టీకి సంబంధించి నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ని కూడా చెప్పింది. ఇక్కడ నో ఆల్కహాల్ .. పార్టీ కూల్ గా జరిగేందుకే ఈ డెసిషన్ అని చెప్పింది రెజీనా కసాండ్రా.
రెజీనా పార్టీ ఇస్తోందనగానే.. సుప్రీం హీరో సాయిధరం తేజ్ 'ఆల్ ది బెస్ట్ పాప గారు' అంటూ ట్వీట్ వేస్తే.. దానికి 'ఓహ్.. థ్యాంక్స్ బాబు గారు' అంటూ రీట్వీట్ పెట్టింది. రెజీనా ఇచ్చే పార్టీకి ఇంకా 15 రోజులుంది కానీ.. వీళ్లిద్దరూ మాత్రం కామెంట్స్ తో జనాలకు హుషారు పంచేస్తున్నారు.