అమ్మవారు కరుణించినా అయ్యవారు ఆజ్ఞాపించలేదు అన్నట్టే ఉందీ సీను. సినిమాకే సినిమా చూపిస్తోంది కరోనా! ప్రభుత్వాలే కరుణించినా నాకు కరుణ లేదంటోంది. మహమ్మారీ భూతం ఎవరినీ ముందడుగు వేయనివ్వదు. వేస్తే కరుస్తానంటోంది!! ఇదిగో ఈ భయమే ఇప్పటికీ షూటింగులు ప్రారంభించకపోవడానికి కారణమని చెబుతున్నారు. పైగా ఏజ్డ్ హీరోలను కొత్త బెంగ నిలువనియ్యడం లేదన్నది తాజా గుసగుస.
తెలుగు సినీపరిశ్రమ ప్రస్తుతం వేచి చూసే ధోరణిలోనే ఉంది. షూటింగులు వెంటనే ప్రారంభించేయాలన్న కంగారు ఎంతమాత్రం కనిపించడం లేదు. స్వయంగా మెగా బాసే ఇంకా వేచి చూస్తున్నారట. వెయిటింగ్ చేయిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించనున్న ఆచార్య కోసం సర్వం సన్నద్ధంగా ఉన్నా కానీ.. మెగా బాస్ నుంచి ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది.
ఈరోజు .. రేపు అంటూ కొరటాల వెయిట్ చేస్తున్నా.. ఇంకా ఇంకా వెయిటింగే! షూటింగ్ తిరిగి ప్రారంభించడంపై చిరు వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా వేచి ఉండి చూడాలనుకుంటున్నందున నిశ్శబ్దంగా ఉన్నారట. బాస్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు సెట్స్ కెళ్లేందుకు దర్శకుడు సహా టీమ్ సిద్ధంగా ఉన్నా కానీ ఇంకా ఏదో తెలీని సందిగ్ధత మెగా బాస్ లో ఉందట.
ఒకవేళ మొండిగా సెట్స్ కి వెళితే దానివల్ల చిత్ర బృందంలోని కళాకారులు .. సాంకేతిక నిపుణుల జీవితాలను ప్రమాదంలో పడేసినట్టేనన్న ఆందోళన పెద్ద బాస్ లో ఉందట. డి.సురేష్ బాబు.. రాజమౌళి సహా ఎందరో ఇంకా సందిగ్ధావస్తలోనే ఉన్నారు. అలాగని తాను కంగారు పడినా ప్రయోజనం ఉండదనే చిరు భావిస్తున్నారట. ఎవరికి వారు వేచి చూసే ధోరణిని విడిచిపెట్టడం లేదు.. మ్ మ్ మ్!! అని గుసగుసలు వినిపిస్తున్నాయ్.