'రాధే శ్యామ్' మేకర్స్ కి మహమ్మారి కష్టాలు...?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే హీరో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్'. ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ బ్యానర్లు కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. 2021లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించిన వెంటనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా మేకర్స్ ని కష్టాలు వెంటాడుతున్నాయట.
కాగా, పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతున్న 'రాధే శ్యామ్' బిజినెస్ అటు హిందీతో పాటు ఇటు సౌత్ లో కూడా సరిగ్గా అవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందులోనూ కరోనా పరిస్థితుల వల్ల అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యే సిచ్యుయేషన్ కూడా కనిపించడం లేదట. మరి ప్రభాస్ క్రేజ్ వల్ల రాబోయే రోజుల్లో 'రాధే శ్యామ్' బిజినెస్ ఆశించిన స్థాయిలో జరుగుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటీనటులను కూడా 'రాధే శ్యామ్' కోసం తీసుకున్నారు. సీనియర్ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, తమిళ నటుడు సత్యన్, మలయాళ నటుడు సచిన్ ఖేడేకర్, ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి, బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్, మురళి శర్మ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.