ఫేడ్‌ ఔట్‌ ముద్దుగుమ్మలకు కోట్లు కురిపిస్తున్న ఓటీటీలు

Update: 2020-11-11 18:00 GMT
ప్రతిభ ఉండాలే కాని ఇప్పుడు ఏ రకంగా అయినా దాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. కేవలం సినిమా మాత్రమే కాకుండా అనేక విధాలుగా సత్తా చాటేందుకు ప్లాట్‌ ఫామ్‌ లు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీల ద్వారా ప్రతిభ చూపించుకోవడంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకావం కూడా ఫిల్మ్‌ మేకర్స్‌ కు మరియు నటీ నటులకు దక్కుతుంది.

అవకాశాలు లేని ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఇప్పుడు ఓటీటీ అనేది ఒక మంచి ఆదాయ వనరు అయ్యింది. వెబ్‌ సిరీస్‌ లు.. వెబ్‌ మూవీలు అంటూ ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. వారి క్రేజ్‌ ను బట్టి పాతిక లక్షల నుండి కోటిన్నర వరకు పారితోషికాలు దక్కించుకుంటున్నారు. కోటిన్నర పారితోషికం అందుకుంటున్నది బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు అంటే మీరు పొరపడ్డట్లే. సౌత్‌ ముద్దుగుమ్మలే ఈ స్థాయిలో ఓటీటీ కంటెంట్ కోసం పారితోషికం అందుకుంటున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా 11త్‌ అవర్‌ అనే వెబ్‌ సిరీస్‌ లో నటించినందుకు గాను ఏకంగా కోటి రూపాయల పారితోషికంను అందుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎప్పుడో కనిపించకుండా పోయిన స్నేహా ఉల్లాల్‌ ఈమద్య ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించి దాదాపుగా 40 లక్షల పారితోషికం అందుకుందట. ఇక ఒక స్టార్‌ హీరోయిన్‌ చేయబోతున్న ఓటీటీ ప్రాజెక్ట్‌ కోసం ఏకంగా 1.5 కోట్ల పారితోషికం అందుకోబోతుందట. ఇప్పటికే కాజల్‌ ఒక వెబ్‌ సిరీస్‌ లో నటించింది. ఇలా సీనియర్‌ హీరోయిన్స్‌ క్రేజ్‌ ఉండగానే ఓటీటీ ఎంటర్‌ అవుతున్నారు.

సినిమాల్లో ఆఫర్లు లేని వారు ఇలా ఆదాయాన్ని దక్కించుకుంటున్నారు. ఒక వేళ ఇలా సక్సెస్‌ అయితే ఖచ్చితంగా మళ్లీ సినిమాల్లో కూడా బిజీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ముందు ముందు ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్స్‌ కు ఓటీటీలు మరింతగా ఆఫర్లను కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలుగు ఆహా వరుసగా పెద్ద ప్రాజెక్ట్‌ లను చేస్తుంది. స్టార్ హీరోయిన్స్‌ మొత్తం ఆహా వైపు చూస్తున్నారు. ప్రస్తుతం పాయల్‌ రాజ్‌ పూత్‌ కూడా ఆహా కోసం ఒక వెబ్‌ సిరీస్‌ ను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Tags:    

Similar News