తెలుగు సినిమా ముద్దు అంటున్న పరభాష నటులు

Update: 2019-10-10 01:30 GMT
తెలుగు సినిమా మార్కెట్ పెరిగే కొద్దీ పరభాషా నటులు తెలుగులోకి రావడం ఎక్కువైపోయింది. వాళ్ళు తమ నటనతో తెలుగు వాళ్ళని కట్టిపడేస్తున్నారు. తమిళ - మలయాళ - కన్నడ - హిందీ - భోజపురి భాషల నుండి ఎంతోమంది నటీనటుల చూపు ఇప్పుడు సౌత్ ఇండియా మీదే ఉంది. ఒక భారీ తెలుగు సినిమాలో మంచి క్యారక్టర్ చేస్తే దేశవ్యాప్తంగా పేరొస్తుందని వాళ్లంతా అనుకోవడమే దీనికి కారణం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఆయా భాషల నుండి మంచి యాక్టర్స్ ను తీసుకొస్తే అక్కడ మన సినిమాలకు మార్కెట్ ఏర్పడుతుందని వాళ్ళకి ప్రిఫెరెన్సు ఇస్తున్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ 'మనం - సైరా నరసింహారెడ్డి' సినిమాలలో కనిపించారు. మలయాళంలో స్టార్ హీరో అయిన మోహన్ లాల్ తెలుగు వారిని విపరీతంగా ఆకట్టుకున్నారు. తన సహజ నటనతో తెలుగు వారిని మరిపించారు. దుల్కర్ సల్మాన్ 'ఓకే బంగారం - మహానటి' సినిమాలతో తెలుగు వాళ్ళకి బాగా దగ్గరయ్యాడు. కిచ్చ సుదీప్ గురించి తెలీని తెలుగు వాళ్ళు ఉండరేమో. 'ఈగ' సినిమాలో ఆయన చూపించిన విలనిజం ఎవరూ మర్చిపోలేరు. అందుకే ఆయన తాజాగా కన్నడలో తీసిన సినిమాను 'పహిల్వాన్' పేరుతొ డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. 'సైరా' లో సుదీప్ - విజయ్ సేతుపతి క్యారక్టర్ కి మంచి పేరొచ్చింది. 'జనతా గ్యారేజ్ - భాగమతి' సినిమాలతో ఉన్ని కృష్ణన్ చాలామందికి తెలిశాడు. మమ్ముట్టి - రవికిషన్ - అధర్వ మురళి ఇలా చెప్పుకుంటూ పొతే లిస్ట్ చాంతాడంత ఉంటది. ఇంతకు ముందు హీరోయిన్లను ఎక్కువగా పరభాష నుండి తీసుకొచ్చేది తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కూడా ఎక్కువగా వాళ్లే ఉంటున్నారు.
Tags:    

Similar News