ఓటీటీలు వరమే కాదు.. శాపం కూడా...!
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో థియేటర్స్ లో బొమ్మ పడక ఆరు నెలలు దాటింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ రీ ఓపెన్ ఎప్పుడు చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు. దీంతో ఫిలిం మేకర్స్ తమ సినిమాలు రిలీజ్ చేసుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్స్ కంప్లీట్ అయిన చిత్రాలను.. రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాలను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో చిన్న సినిమాల విడుదలకు ఓటీటీలు వరంగా మారనున్నాయని అందరూ అనుకున్నారు. అయితే ఫ్యూచర్ లో ఓటీటీలు చిన్న సినిమాలకు శాపంగా మారే అవకాశాలు లేకపోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
కాగా, చిన్న సినిమాలు లిమిటెడ్ బడ్జెట్ లో నిర్మించిన సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇబ్బందులు పడుతుంటారనే మాట ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినపడుతూ ఉంది. అయితే వీటన్నిటిని దాటుకొని థియేటర్ లో రిలీజై సెన్సేషన్ సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న స్టార్స్ అందరూ అలాంటి సినిమాల ద్వారా వచ్చిన వారే. అయితే ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవడం వల్ల ఆడియన్స్ ఓటీటీలకే అలవాటు పడే అవకాశం ఉంది. దీని వల్ల ప్రేక్షకులు చిన్న సినిమాలు అంటే కేవలం ఓటీటీలకే పరిమితం అనుకునే ప్రమాదం ఉంది. దీంతో భవిష్యత్ లో చిన్న సినిమాల కోసం థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలకు ఓటీటీలు బాగానే ఉపయోగపడుతున్నప్పటికీ ట్రెండ్ ఇలానే కొనసాగితే థియేటర్ లో చిన్న సినిమాల విడుదల గురించి మర్చిపోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.