ఓటీటీలో సక్సెస్ అయింది సరే.. మరి ప్రొడ్యూసర్ బయటపడినట్లేనా...?

Update: 2020-10-12 08:45 GMT
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ - మాళవికా నాయర్‌ జంటగా నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాని 'ఆహా' ఓటీటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'గుండజారి గల్లంతయ్యిందే' 'ఒక లైలా కోసం' సినిమాల తరహాలోనే డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా 'ఆహా'లో 4 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'ఒరేయ్ బుజ్జిగా'కి మరే సినిమాకి రాన్నంత వ్యూస్ వ‌స్తున్నాయని 'ఆహా' టీమ్ కూడా చెబుతోందని ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమాని తక్కువ డీల్ కే ఓటీటీకి అమ్మినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

'ఒరేయ్ బుజ్జిగా' మేకర్స్ ఈ చిత్రం కోసం 5 కోట్లకు పైగా ఖర్చుపెట్టారట. అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ పద్ధతిలో 4 నుంచి 4.5 కోట్ల మధ్య డీల్ కుదుర్చుకున్నాడట. ఇదే కనుక నిజమైనతే ఈ సినిమా డెఫిషిట్ లోనే రిలీజ్ అయిందనే చెప్పాలి. ఓటీటీలో సక్సెస్ అయిన ఈ సినిమా మరి ప్రొడ్యూసర్ కి ప్రాఫిట్ తెచ్చిపెట్టిందా లేదా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కానీ 'ఒరేయ్ బుజ్జిగా'తో పాటు రిలీజైన అనుష్క 'నిశ్శబ్దం' కంటే ఈ మూవీకే మంచి స్పందన వస్తుందని ఓటీటీ వర్గాల అభిప్రాయం. అందుకే చిత్ర యూనిట్ ఇటీవల సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ప్రేక్షకులందరూ హాయిగా నవ్వుకోవాలని ఈ సినిమా చేశామని.. మా లక్ష్యం నెరవేరిందని.. రెండున్నర గంటలు పక్కా వినోదం అందించిందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నార'ని చిత్ర యూనిట్ తెలిపారు.
Tags:    

Similar News