నాగార్జున కర్చీఫ్ వేసేశాడు

Update: 2015-11-08 19:30 GMT
గత ఏడాది ‘మనం’ లాంటి మరపురాని సినిమాను అందించిన అక్కినేని నాగార్జున.. ఆ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు. బాగా గ్యాప్ తీసుకుని కాస్త ముందు వెనుకగా రెండు సినిమాలు మొదలుపెట్టాడు. అవే.. సోగ్గాడే చిన్నినాయనా - ఊపిరి. ఇందులో ‘సోగ్గాడే చిన్నినాయనా’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ‘ఊపిరి’ని వచ్చే ఏడాదికి వాయిదా వేయించిన నాగ్.. దానికి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయించాడు.

సంక్రాంతి సందడి ముగిసిపోయాక అన్ సీజన్ అనదగ్గ ఫిబ్రవరిలో 5వ తారీఖున ‘ఊపిరి’ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు పీవీపీ సినిమా వాళ్లు. మామూలుగా అయితే ఫిబ్రవరి అన్ సీజనే కానీ.. ఈసారి మాత్రం ఆ నెలలో కూడా పెద్ద సినిమాల తాకిడి ఖాయమనిపిస్తోంది. త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అ..ఆ’తో పాటు ఓ నందమూరి హీరో సినిమా కూడా ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశముంది. సంక్రాంతికి పోటీ పడతాయనుకున్న నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ సినిమాల్లో ఒకటి ఫిబ్రవరికి వాయిదా పడొచ్చని తెలుస్తోంది. ఐతే ఎవరొస్తే రానీ అని.. నాగ్ మాత్రం ముందుగా కర్చీఫ్ వేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ తో పాటు కార్తి, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News