• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పవర్ స్టార్' సినిమా ఏ...

'పవర్ స్టార్' సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తారు..?

By - Tupaki Desk
Update: 2020-07-12 05:50 GMT
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టినప్పటి నుండి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో జనాల్ని వణికించడం స్టార్ట్ చేశాడు. గత నాలుగు నెలలుగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అయింది కానీ వర్మ సినిమాలు మాత్రం ఆగలేదు. కరోనా నా కోసమే వచ్చింది అనే రేంజ్ లో వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ప్రకటించడమే కాకుండా ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కూడా చేశాడు. సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ రీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదంటూ సొంతంగా శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ వారితో కలిసి 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' అనే ఏటీటీ స్టార్ట్ చేసి తన సినిమాలన్నీ ఇక్కడే విడుదల అవుతాయని చెప్పుకొచ్చాడు. వెబ్ కంటెంట్ కి సెన్సార్ కూడా లేకపోవడంతో రెచ్చిపోయిన వర్మ 'క్లైమాక్స్' 'నగ్నం' లాంటి సినిమాలను వదిలాడు. ఈ క్రమంలో 'పవర్ స్టార్' అనే వివాదాస్పద టైటిల్ తో సినిమా తీస్తున్నానని వెల్లడించి సంచలనం రేపాడు. అక్కడితో ఆగకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో త్వరలోనే రిలీజ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు 'పవర్ స్టార్' సినిమా శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.

'పవర్ స్టార్' సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నా ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి తీస్తున్నారని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఈ క్రమంలో ఈ వివాదాస్పద సినిమాని రిలీజ్ చేయడానికి శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ వారు ముందుకు వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీని పై శ్రేయాస్ అధినేత శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ 'పవర్ స్టార్' శ్రేయాస్ ఈటీ యాప్ లో విడుదల చేయడం లేదని పేర్కొన్నారట. 'పవర్ స్టార్' సినిమా మాత్రమే కాదు.. వివాదాస్పదమయ్యే ఏ సినిమాను మేము విడుదల చేయమని ఆయన ప్రకటించారట. కానీ వర్మ మాత్రం తన 'పవర్ స్టార్' సినిమాని 'ఆర్జీవీ వరల్డ్ థియేటర్' లో రిలీజ్ చేస్తున్నామంటూ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈ వివాదాస్పద చిత్రాన్ని ఏ ప్లాట్ ఫార్మ్ పై రిలీజ్ చేస్తారనే విషయంలో రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    
  • RGV 
  • Janasena 
  • Powerstar 
  • Powerstar First Look 
  • Rgv Latest Movie 
  • Naked Movie Trailer 
  • Rgv Latest Movies 
  • Climax 
  • Latest Movie Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS