• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. నాగ్ చేతిలో శంకు...

వావ్.. నాగ్ చేతిలో శంకు చక్రాలు..

By - Tupaki Desk
Update: 2016-08-14 17:21 GMT
అక్కినేని నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా 'ఓం నమో వేంకటేశాయ'. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనివాసుడి భక్తుడిగా నాగార్జున కనిపించనున్నాడు. స్వామి పరమ భక్తుడైన హథీరామ్ బాబా జీవితాన్నే.. ఈ సినిమాగా మలుస్తున్నాడు దర్శకేంద్రుడు.

ఇప్పటికే వేంకటేశ్వర స్వామి సహా పలువురి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన యూనిట్.. ఇప్పుడు హథీరామ్ బాబాగా నటిస్తున్న నాగార్జున వీడియోను కూడా విడుదల చేశారు. అయితే.. మిగతా వీడియోల మాదిరిగా కాకుండా.. శంఖం పట్టుకున్న నాగ్ చెయ్యి వరకు వరకూ చూపించి.. ప్రీలుక్ అనేశారు. అంతే కాదు.. శంఖు చక్ర దండధారి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ త్వరలో అంటూ ఊరించేశారు. వెనుక వెంకన్న విగ్రం ఉండగా.. ముందు శంఖు చక్రాలను పట్టుకున్న నాగ్ కనిపిస్తారన్న మాట.

గతంలో అన్నమయ్య.. శ్రీరామదాసు.. శిరిడి సాయి చిత్రాలతో నాగ్ గెటప్ ను.. ఇమేజ్ ను కొత్తగా ఆవిష్కరించిన రాఘవేంద్రరావు.. ఈసారి వెంకన్న భక్తుడిగా మరో స్థాయిలో చూపించనున్నారని తెలుస్తోంది. కీరవాణి అందిస్తున్న సంగీతం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుండగా.. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్.. విమలా రామన్ లు కూడా నటిస్తున్నారు. వెంకటేశ్వరునిగా హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్ నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఇతని లుక్ అందరినీ ఆకట్టుకుంది.
Full View

Tags:    
  • Om Namo Venkatesaya 
  • Nagarjuna 
  • Telugu NEws 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS