ఫోటో స్టోరీ: వెయ్యి వోల్టుల షాకిచ్చే పచ్చబొట్టు!

Update: 2019-12-15 05:47 GMT
బాలీవుడ్ లో ఉండే లెక్కకు మిక్కిలి చక్కని చుక్కలలో నుష్రత్ భరూచా ఒకరు.  బాలీవుడ్ లో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'.. 'ప్యార్ కా పంచనామా'.. 'సోనూ కే టిటూ కే స్వీటీ' లాంటి హిట్టు సినిమాల్లో నటించింది.  ఈమధ్య ఆయుష్మాన్ ఖురానా నటించిన 'డ్రీమ్ గర్ల్' సినిమాలో కూడా నటించింది. అలా అని పాపకు సౌత్ టచ్ లేదనుకుంటే పాపం. తెలుగులో 'తాజ్ మహల్'(2010) అనే ఒక సినిమాలో కూడా నటించింది.  ఒక్క బికినీతోనే ఉష్ణోగ్రతలను కకావికలు చేసి ఎల్ నినో లాంటి వంద ఎఫెక్టులను అవలీలగా తెప్పించగలదు ఈ భామ.

తాజాగా మరోసారి అదే పని చేసింది. ప్రస్తుతం ఈ భామ మాల్దీవ్స్ వెకేషన్ లో సరదాగా గడుపుతోంది.  అసలే అందమైన ప్రదేశం. పాపేమో బికినీలంటే చెవులు కోసేసుకుంటుంది. అందుకే అందమైన బికినీ ధరించి మరీ కత్తిలాంటి ఫోటో షూట్ చేసింది. పింక్ బికినీలో పవర్ ఫుల్ పోజులిస్తూ తీయించుకున్న ఫోటోలను పోస్ట్ చేసి "నేనెక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది.  నిజమే భలే ఫిలాసఫీ చెప్పింది.  అందరూ ఎక్కడో ఉండాలనుకుంటారు.. కానీ ఇక్క.. డే ఉంటారు. ఎక్కడికీ పోరు.  ఈ భామ మాత్రం అలా కాదు. ఎక్కడ ఉండాలని అనుకుంటుందో అక్కడే ఉంటుందట.  ఆ కిటుకేదో చెప్పేస్తే అందరూ అదే ఫాలో అవుతారు కదా?

ఫోటోలో ఒక బోటు కు ఉండే నిచ్చెనపై నిలుచుని..  లేడీ బాలీవుడ్ ఖిలాడి తరహాలో నవ్వుతూ యాక్షన్ పోజులిచ్చింది.  ఆ పింక్ బికినీ ఎవరు డిజైన్ చేశారో కానీ ఆ వ్యక్తికి అర్జంటుగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.  నోబెల్ శాంతి బహుమతి ఇట్టాంటి వాటికి ఇవ్వరు కదా అంటారా? శాంతికి పర్మనెంట్ అడ్రెస్ అయిన మన గాంధీజీకి ఇవ్వరు కానీ.. చీటికిమాటికి యుద్ధాలు చేసే అమెరికా అధ్యక్షులకు శాంతి బహుమతి ఇస్తారు. వారికి ఇచ్చినప్పుడు ఈ పాపకు కత్తిలాంటి బికినీని డిజైన్ చేసిన టైలర్ కు ఇస్తే తప్పేంటి? అయినా ఆ పచ్చబొట్టు వీలైనంతగా కనిపించేలా.. డేంజరస్ బోర్డర్ లో అసభ్యత హద్దులు దాటకుండా కళాత్మకత మాత్రమే హైలైట్ అయ్యేలా బికినీని కుట్టడం ఎంత కష్టమో ఒక దర్జీ అయితే కానీ తెలియదు. ఇలాంటివారికి నోబెల్ ఏం ఖర్మ.. ఎకాడమీ అవార్డు.. గోల్డెన్ గ్లోబు అవార్డు అన్నీ ఇచ్చెయ్యాలి. ఈ అవార్డుల విషయం పక్కన పెట్టి సినిమాల విషయానికి వస్తే ఈ భామ   'తుర్రం ఖాన్'.. 'హర్దంగ్' అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.


Tags:    

Similar News