యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏడు నెలల విరామం తరువాత ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొనగా జక్కన్న కీలక ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆలస్యంగా మొదలైన ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది లో పూర్తి కానుంది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఓ భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు హారికా అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ..., హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలిసింది. అయితే అది ఎప్పుడు ఏ నెల అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశారని తెలిసింది.
ఈ మూవీ యుఎస్.ఏ నేపథ్యంలో అత్యధిక భాగం చిత్రీకరణ సాగుతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ ప్రాజెక్టును ప్రారంభించవచ్చని చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్`ని పూర్తి చేసే సమయానికి మహేష్ చిత్రాన్ని పూర్తి చేయాలని త్రివిక్రమ్ పక్కా ప్లాన్ ని సిద్ధం చేసుకుంటున్నారట.