బిగ్ బాస్ హోస్ట్‌ గా యంగ్ టైగర్

Update: 2017-05-29 13:20 GMT
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులు.. డిజాస్టర్ల తర్వాత తనను తాను మార్చుకున్న జూనియర్.. టెంపర్ నుంచి తన స్పీడ్ చూపిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో అంటూ 50 కోట్ల మార్క్ అందుకుని.. జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ తో పాటు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశాడు.

ఇప్పుడు మరో ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు జూనియర్. ఈ సారి టెలివిజన్ పై తన ట్యాలెంట్ చూపించనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షో తెలుగు వెర్షన్ నిర్వహించబోతున్న స్టార్ మా ఛానల్.. ఇందుకోసం ఎన్టీఆర్ తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు స్టార్లను పరిశీలించిన తర్వాత.. ఎన్టీఆర్ కు భారీ మొత్తం ఆఫర్ చేసి.. ఈ షో చేసేందుకు ఒప్పించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తమిళ వెర్షన్ కోసం కమల్ హాసన్ సైన్ చేయగా.. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ను ఎన్టీఆర్ తో చేయించడం ఖాయం అంటున్నారు.

త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ తో పాటు.. షూటింగ్ అప్ డేట్స్ కూడా  వెల్లడించనున్నారని తెలుస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ ను హోస్ట్ గా తీసుకున్న తర్వాత బిగ్ బాస్ షోకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకే ఇప్పుడు రీజనల్ వెర్షన్స్ ను.. ఇక్కడి స్టార్స్ తో చేయిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News