ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్. నేడు బర్త్ డే బాయ్ అయిన ఆయన.. ఇక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన గతానికి చెందిన ఒక విషయాన్ని చెప్పుచ్చారు . దాదాపు పదహారేళ్ల కిందట జూనియర్ ను హీరోగా ఈనాడు సంస్థల అధినేత సీహెచ్ రామోజీరావు నిన్ను చూడాలని చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే జూనియర్ హీరోగా తెరంగేట్రం చేశారు.
పదహారేళ్ల కిందట నాలుగు లక్షల రూపాయిలు అంటే పెద్ద మొత్తం కిందనే లెక్క. పారితోషికంగా కవర్లో పెట్టి ఇచ్చిన ఆ మొత్తాన్ని చూసినంతనే ఏం చేయాలో జూనియర్ కు అస్సలు అర్థం కాలేదట. ఆ రూ.4లక్షల కవర్ని పట్టుకొని ఎక్కడ దాచిపెట్టాలో తెగ ఆలోచించాడట.
మొదట ఆ కవర్ ను ఇంట్లో ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచాడట. అక్కడ సేఫ్ కాదని బాత్రూమ్ లో పెట్టేశాడట.అలా ఉంచితే ఎవరైనా చూస్తారనుకొని కారు డాష్ బోర్డులో పెట్టేశాడట. అలా పెడితే కారు డ్రైవర్ తీసుకునే అవకాశం ఉందని అక్కడ కూడా తీసేసినట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చివరకు.. ఆ మొత్తాన్ని తీసుకొని తల్లికి బహుమతిగా ఇచ్చేశాక మనసుకు హాయిగా.. ప్రశాంతంగా అనిపించిందని గతాన్ని గుర్తు చేసుకున్నాడు తారక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/