సుక్కూ సినిమాలో జిమ్నాస్టిక్‌ లుక్‌

Update: 2015-04-10 07:43 GMT
హఠాత్తుగా ఆరు పలకలు ఓపెన్‌ చేసి ఒక్కసారిగా షాక్‌కి గురి చేశాడు ఎన్టీఆర్‌. టెంపర్‌లో కొత్తలుక్‌తో పరేషాన్‌ చేశాడు. మగువల గుండెల్లో రాకుమారుడు అయిపోయాడు. ఫ్యాట్‌బోయ్‌ నుంచి స్లిమ్‌బోయ్‌ అయిపోయాడు. దానికోసం అహోరాత్రలు శ్రమించాడు. పూరి ఏం చెప్పాడో.. ఇంతలోనే ఎంత మార్పు? అనుకున్నారు అభిమానులు, సామాన్య ప్రేక్షకజనం.

అయితే జిమ్ముతో ఎక్కే కిక్కు అంతా ఇంతా కాదు. అది ఒకసారి వెంటపడితే వదిలేది కాదు. ఆ కిక్కులో ఇంకొంచెం కిక్కెక్కుతుంది. కష్టపడితే పోయేదేం ఉంది. అదనపు కొవ్వు తప్ప అన్న పద్ధతిలో ఎవరికివారు తమని తాము కష్టపెట్టుకోవడానికి సిద్ధపడిపోతారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఎన్టీఆర్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చుకోవడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నాడు. రోజూ నాలుగు గంటలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. దీనికోసం ఇంట్లోనే జిమ్ము ఏర్పాటు చేసుకున్నాడు. పైగా ఈ పాటికే సుశిక్షితుడైన కోచ్‌ సమక్షంలో రాటుదేలి ఉన్నాడు కాబట్టి స్వయంగానే కఠోరసాధన చేస్తున్నాడు.

ఇదంతా సుకుమార్‌తో సినిమా కోసమే. ఈ చిత్రంలో జిమ్నాస్టిక్‌ లుక్‌లో కనిపించాలని సుక్కూ సూచించాడట. అందుకోసమే ఈ శ్రమ అని అంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్‌-సుకుమార్‌ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీమ్‌ స్పెయిన్‌లో ఉంది. త్వరలోనే లండన్‌లో మూవీ లాంచ్‌.
Tags:    

Similar News