• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలి

By - Tupaki Desk
Update: 2022-06-20 00:30 GMT
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కొరటాల శివ మూవీ అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. అరవింద సమేత తర్వాత ఆర్ ఆర్ ఆర్ తో వచ్చేందుకు దాదాపుగా మూడు సంవత్సరాలు తీసుకున్న ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను వెంటనే చేయాలని భావించినా ఆచార్య ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే పడింది.

చిరంజీవితో ఆచార్య ను చేసి ప్లాప్ అయిన కొరటాల శివ ఆ సెటిల్‌మెంట్‌ విషయంలో తలమునకలై ఉన్నాడట. మరో వైపు ఆచార్య ఎఫెక్ట్ తో ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమాకు స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్‌ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా జనతా గ్యారేజ్ కు వంటి ఒక మంచి స్క్రిప్ట్‌ ను కొరటాల శివ ప్లాన్‌ చేస్తున్నాడు.

ఆచార్య సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్‌ తో చేయబోతున్న సినిమా సబ్జెక్ట్‌ కాస్త భారీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కొరటాల శివ అంత భారీ ప్రాజెక్ట్‌ ను ఎంత వరకు డీల్‌ చేయగలడు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా కొరటాల శివ స్టామినాకు తగ్గట్లుగా మంచి స్క్రిప్ట్‌ రెడీ చేసుకోవాలని అభిమానులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్‌ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటి వరకు ప్రారంభం అయ్యి షూటింగ్ కొంత మేరకు పూర్తి అవ్వాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు సినిమా స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇంకా చాలా కాలం పాటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఎదురు చూడక తప్పదు అన్నట్లుగా యూనిట్‌ సభ్యుల నుండి అనధికారికంగా హింట్స్ ఇస్తున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబో సినిమా కూడా పట్టాలెక్కబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం సలార్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వగానే ఎన్టీఆర్‌ మూవీని పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ తో సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌ చాలా ఆసక్తిగా ఉన్నాడు.

కాస్త అటు ఇటు అయితే కొరటాల శివ సినిమా కంటే ముందుగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల కాంబో మూవీ ఉన్నా ఆశ్చర్యం లేదు అంటూ సినీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్‌ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం కనీసం ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.
Tags:    
  • NTR 
  • Koratala Siva 
  • NTR30 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS