ఎన్టీఆర్‌.. కొరటాల మూవీ కాస్త టైమ్‌ పట్టేలా ఉంది

Update: 2021-08-20 15:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా ను గత ఏడాది ఆరంభం నుండి ఊరిస్తూ వస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ముగిసిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా అనుకున్నారు. కాని కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ జత కట్టాడు. దాంతో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల వీరి కాంబో మూవీ మళ్లీ ఆలస్యం అయ్యింది. ఇన్నాళ్లు కొరటాల 'ఆచార్య' మూవీని పూర్తి చేయాలి.. ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ముగించాల్సి ఉందంటూ అంతా వెయిట్‌ చేశారు.

ఇద్దరు కూడా వారి వారి సినిమాలను ముగించి ఆగస్టులో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులో కాదు కదా కనీసం సెప్టెంబర్‌ లో కూడా వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్‌ లో వీరి కాంబో మూవీ షూటింగ్ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయట. ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగిసింది. సినిమా ను అక్టోబర్ లో విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యేలా ఉంది.

ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివలు ఇద్దరు కూడా వారి వారి సినిమాలను పూర్తి చేశారు. కాని ఎన్టీఆర్‌ 30 కి సంబంధించి కొంత బ్యాక్ గ్రౌండ్‌ వర్క్‌ జరగాల్సి ఉందట. అందుకే సినిమా ను  మొదలు పెట్టేందుకు రెండు నెలల సమయం తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ తదుపరి సినిమా ను కూడా ఖచ్చితంగా సక్సెస్‌ చేస్తాడనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఎన్టీఆర్‌ తో మరోసారి చాలా పవర్‌ ఫుల్‌ కథను సినిమాను చేస్తున్నట్లుగా కొరటాల సన్నిహితులు చెబుతున్నారు.
Tags:    

Similar News