తారక్ చేసింది కరెక్ట్ కాదేమో?
నందమూరి ఫ్యామిలిలో స్టార్ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ గత కొంత కాలంగా కళ్యాణ్ రామ్ తమ్ముడితో చాలా ప్రేమగా ఉండడం చూస్తూనే ఉన్నాం. అందుకోసం కళ్యాణ్ బాలకృష్ణ ను అలాగే ఇతర పెద్దలను కూడా దూరం పెట్టారనేది ఒక టాక్. ఆ విషయం గురించి పక్కనపెడితే ఎన్టీఆర్ ఇప్పుడు కళ్యాణ్ ను పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఎందుకంటే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్ఎల్ఏ సినిమా ప్రమోషన్స్ లో మనోడు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ కథ కోసం ఫిట్ అవుతున్నాడు. కొత్త లుక్ సీక్రెట్ గా ఉంచాలి అనే సాకులతో ప్రమోషన్స్ రాకుండా తప్పించుకున్నాడు. పోనీ కనీసం ట్వీట్ అయినా చేశాడా అంటే అది లేదు. కానీ రంగస్థలం సినిమా మాత్రం అదిరిపోయింది అని చెప్పడం ఇప్పుడు నందమూరి సన్నిహిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కళ్యాణ్ రామ్ ఏమనుకోకున్నప్పటికీ ఆయన సన్నిహితులు మాత్రం తారక్ చేసిందేమి బాలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. ఇక ఇప్పుడు అవన్నీ చాలదు అన్నట్టు తారక్ మహేష్ సినిమా కోసం అతిధిగా వెళ్లడం మరొక హాట్ టాపిక్ అయ్యేలా ఉంది. నందమూరి అభిమానులు ఇది ఎలా అర్ధం చేసుకుంటారో గాని ఓ వర్గం వారు మాత్రం అన్నయ్య సినిమా కోసం వెళ్లలేదు కానీ మహేష్ సినిమా కోసం వెళ్లేందుకు తీరిక దొరికిందా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కళ్యాణ్ రామ్ అభిమానులు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.