జాగ్రత్తగా ఉండమంటున్న ఎన్టీఆర్

Update: 2018-02-20 04:24 GMT
మంచి మాటలు ఎవరు చెప్పినా వినడం మంచిదే. కానీ అదే మంచి మాటలు సెలబ్రిటీలు చెబితే ఎక్కువమందికి చేరుతుంది. ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అదే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రారంభించిన ప్రచార కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొంతు కలిపాడు.

సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడంలో అవగాహన పెంచేలా హైదరాబాద్ సిటీ పోలీసులు షార్ట్ ఫిలింలు రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ కనిపించి అమ్మాయిలూ.. జాగ్రత్తగా ఉండమని హితవు పలికాడు. సోషల్ మీడియాలో పరిచయాలను అతిగా విశ్వసించి వ్యక్తిగత సమాచారం.. ఫొటోలు షేర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియజేసేలా ఈ షార్ట్ ఫిలిం ఉంది. ‘‘వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.. తగు జాగ్రత్త వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు.  అలాంటి అనుభవం ఎదురైతే పోలీసులకు రిపోర్ట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి’’అంటూ తన గంభీరమైన స్వరంతో అందరినీ ఆలోచింపజేసే మెసేజ్ ఇచ్చాడు.

ఈ రోజుల్లో ఇంటర్నెట్ వాడకం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టే సైబర్ క్రైములు సైతం పెరుగుతున్నాయి. తెలియక కొంతమంది.. తెలిసీ తెలియక మరికొంతమంది వాటి బారినపడి మోసపోతున్నారు. అందుకే అందరిలోనూ అవగాహన పెంచేందుకు యూత్ విపరీతమైన ఫాలోయింగ్.. సెలబ్రిటీగా క్లీన్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ముందుకు రావడం నిజంగా అభినందనీయమే.

Full View

Tags:    

Similar News