స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ కొత్త సినిమా..

Update: 2020-04-10 11:50 GMT
సినీ ఇండస్ట్రీలో ఎంత కంఫర్ట్ అనిపించినా కూడా మళ్ళీ మళ్ళీ అవే కాంబినేషన్స్ సెట్ చేసుకోవడానికి ఏ దర్శకుడూ - హీరో కూడా అంతలా ఇష్టపడరు. రిపిటీషన్ వస్తుందన్న ఉద్దేశంతో కొత్త కాంబినేషన్స్ కోసం చూస్తుంటారు. అయితే త్రివిక్రమ్ మాత్రం అలాంటివేం పట్టించుకోడు. తనకు కంఫర్ట్ అనిపిస్తే పనిచేసిన వాళ్ళతోనే మళ్ళీ మళ్ళీ చేయడానికి చూస్తుంటాడు. కెరీర్ మొదట్లోనే మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసేసాడు త్రివిక్రమ్. తర్వాత పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేసాడు. రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంతో కలుపుకుంటే అల్లు అర్జున్ తో కూడా మూడు సినిమాలు చేసాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో రెండోసారి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ మే నుండి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన కొమరమ్ భీమ్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయనున్నాడు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ చాలా స్టైలిష్ గా చూపించనున్నాడనేది తాజా సమాచారం. కొంతకాలంగా ఎన్టీఆర్ సినిమాకి సినిమాకి మధ్య లుక్ విషయంలోను కొత్తదనాన్ని చూపుతూ వస్తున్నాడు. అలాగే ఈ సినిమాలోనూ ఆయన కొత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు.
   

Tags:    

Similar News