ఓటీటీ సినిమాలపై పంజా విసురుతున్న పైరసీ భూతం...!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓటీటీ.. అంటే 'ఓవర్ ది టాప్' అని అర్థం. మారుతున్న టెక్నాలజీతో పాటు సినిమా రిలీజ్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాలు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్స్ కి వెళ్లేవారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చొని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో ఫ్యామిలీతో కలిసి చూసేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా చూపించాలని ట్రై చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్ లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. ఇక తిరిగి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే షూటింగులకు అనుమతిస్తున్న ప్రభుత్వాలు థియేటర్స్ ఓపెనింగ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రాబోయే రెండు నెలల్లో థియేటర్స్ ఓపెన్ చేసినా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ కి వస్తారా అనేదీ అనుమానమే. దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న సినిమాలను ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం చేసుకుంటున్నాయి. ఇక నిర్మాతలు కూడా ఫైనాన్సియర్స్ దగ్గర తెచ్చిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలలో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలకి ఫైరసీ అనేది పెద్ద సమస్యగా మారింది.
ఇప్పటికే ఓటీటీలో రిలీజైన 'గులాబో సితాబో'.. ఆర్జీవీ 'క్లైమాక్స్' సినిమాలు ఓటీటీలో రిలీజైన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్స్ లో దర్శనమిచ్చాయి. ఇంతకముందు థియేటర్స్ లో సినిమాలు రిలీజైనప్పుడు కూడా పైరసీ అనేది సినిమాకి భూతంలా ఉండేది. అయితే అప్పుడు థియేటర్ ప్రింట్స్ మాత్రమే పైరేటెడ్ సైట్స్ లో పెట్టేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు హెచ్ డీ ప్రింట్స్ విత్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడాలని ఎంతమంది ప్రేక్షకులు అనుకుంటారు. హెచ్ డీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకొని స్మార్ట్ టీవీలో ఫ్యామిలీ మొత్తం ఫ్రీగా చూడొచ్చు అని ఆలోచిస్తాడు. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ లకి వెళ్తున్న సినిమాలకి పెట్టిన బడ్జెట్ వెనక్కి వచ్చేనా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న సినిమాలైతే ఓటీటీలు ఇచ్చే ఆఫర్ కి వర్కౌట్ అవుతాయేమో కానీ.. భారీ బడ్జెట్ పెట్టి తీసే పెద్ద సినిమాల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ పెద్ద సినిమాలకు 'పే పర్ అవర్' పద్ధతిలో లాంగ్ రన్ ని బట్టి ఓటీటీలు డబ్బులు చెల్లిస్తామంటే ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ లో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓవర్ ది టాప్ వాటిని గట్టెక్కించగలదా అనే డౌట్ రాకమానదు. ఇంతకముందు థియేటర్స్ సినిమా రిలీజ్ అయితే టాక్ తో.. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ నిర్మాతను దాదాపుగా గట్టెక్కించేవి. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు గంటల్లోనే ఒరిజినల్ క్వాలిటీతో పైరసీ సైట్స్ లో అందుబాటులో ఉంటోంది. దీంతో చిన్న సినిమాలకు పెద్దగా ప్రభావం లేకపోయినా పెద్ద సినిమాలు మాత్రం నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.