మీకు మాత్రమే చెప్తా.. నోటా సెంటిమెంట్!

Update: 2019-10-09 05:23 GMT
యూత్ లో మంచి ఫాలోయింగ్ సాధించిన యువ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడనే సంగతి తెలిసిందే.  తనకు 'పెళ్ళిచూపులు' సినిమాతో ఫస్ట్ సోలో హిట్ అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మిస్తున్నాడు.  కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టి  సినిమా టీజర్ ను కూడా విడుదల చేశారు.

అయితే టీజర్ ను చూస్తే ఈ సినిమా ఒక సెక్షన్ ఆడియెన్స్ కు మాత్రమే కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అర్థం అవుతుంది. న్యూ జెన్ ఫిలిం కాబట్టి యూత్ ను టార్గెట్ చేసిన సినిమా.  అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక నెగెటివ్ సెంటిమెంట్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  గతంలో'నోటా' ప్రమోషన్స్ లో 'మీకు మాత్రమే చెప్తా' అనే క్యాప్షన్ ను  విజయ్ దేవరకొండ వాడిన సంగతి కొందరికి గుర్తు ఉండచ్చు.  అయితే విజయ్ ఎంతగా మీకు మాత్రమే చెప్తా అని ఊదరగొట్టినా ఆ 'నోటా' ను ఎవరూ పట్టించుకోలేదు. విజయ్ కెరీర్ లో అదో ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు అదే క్యాప్షన్ ను ఈ సినిమాకు టైటిల్ గా వాడడం ఏం కలిసి వస్తుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయినా ఇలాంటి సెంటిమెంట్లు ఎప్పుడూ ఉండేవే. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే మాత్రం టార్గెట్ ఆడియన్సుకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.  విజయ్ దేవరకొండకు నిర్మాతగా ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం వచ్చేనెల వరకూ వేచి చూడకతప్పదు.


Tags:    

Similar News