నోటా డేట్ ఫిక్స్ అయిందోచ్!

Update: 2018-09-22 07:16 GMT
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' కోసం ఆడియన్స్ ఇప్పుడు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అసలే 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ విజయంతో విజయ్ మార్కెట్ రెడ్ హాట్ గా ఉండడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా పై అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి.  ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ గా ఫిక్స్ అయింది.

అక్టోబర్ 5 న నోటా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఫిలిం మేకర్స్ తెలిపారు.  ఈ విషయాన్ని తెలుపుతూ ఒక  పవర్ఫుల్ రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేయడం విశేషం. ఈ సినిమా విజయ్ కెరీర్ లో మొదటి ద్విభాషా చిత్రం. మొదటి సరి విజయ్ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.  విజయ్ తమిళంలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో తమిళ యూత్ లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ - నాజర్ ఇతర కీలక పాత్రలలో నటించారు. విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు ఆనంద్ శంకర్ దర్శకుడు.  సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.  స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించాడు.  


Tags:    

Similar News