చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న రకుల్
ఒక సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఊపు చూస్తే టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఆమే అనిపించింది. కాజల్ - సమంత - తమన్నాల ఊపు తగ్గాక సరైన టైంలో ఆమె రైజ్ అయింది. ఆ ముగ్గురితో పోలిస్తే కొన్ని విషయాల్లో వెనుకబడినా.. రకుల్ కు పెద్ద పెద్ద అవకాశాలు రావడం - తారాపథంలో దూసుకెళ్లడం చూసి ఫీలైన వాళ్లు కూడాా ఉన్నారు. కానీ రకుల్ హవా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఆమె ఎంతో కాలం టాప్ లీగ్‌లో నిలవలేకపోయింది. వరుస ఫ్లాపులతో చూస్తుండగానే డౌన్ అయిపోయింది. అసలు చేతిలో సినిమాలే లేని పరిస్థితికి వచ్చేసింది. గత రెండేళ్లలో రకుల్ కు చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ కూడా వచ్చేసింది. ఈ మధ్య ఎన్నో ఆశలతో ‘మన్మథుడు-2’ సినిమా చేస్తే దారుణమైన ఫలితం వచ్చింది. దీంతో టాలీవుడ్ లో ఆమె అడ్రస్ దాదాపు గల్లంతయిపోయిన పరిస్థితి వచ్చింది.
ఐతే కెరీర్ చరమాంకానికి వచ్చాక రకుల్ తన బోల్డ్ యాక్ట్స్‌తో ఇటు ప్రేక్షకుల్ని అటు ఇండస్ట్రీ జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. గత కొన్ని నెలల్లో రకుల్ ఎన్నో బోల్డ్ ఫొటో షూట్లు చేసింది. తన ఫిట్నెస్ మీద దృష్టిపెట్టి కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫిట్ గా తయారైంది. గతంతో పోలిస్తే ఆమె లుక్ - ఫిజిక్ బెటర్ గా అనిపిస్తున్నాయి. ఫొటో షూట్లలో హాట్ నెస్ కూడా పెంచింది. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఎంతగా స్కిన్ షో చేసినా - ఎన్ని హొయలు పోయినా ఆమెను జనాలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. తెలుగుతో పోలిస్తే తమిళం - హిందీల్లో రకుల్ కొద్దో గొప్పో అవకాశాలు వస్తున్నాయి. కానీ అక్కడ కూడా ఎంతకాలం రకుల్ నిలబడుతుందో.. కెరీర్ ను ఎన్నాళ్లు పొడిగించుకుంటుందో చూడాలి మరి.