#BOND25 డేనియ‌ల్ క్రెయిగ్ కి ఇక‌ సెండాఫ్‌

Update: 2020-10-15 04:15 GMT
జేమ్స్ బాండ్ సిరీస్ అన‌గానే టైటిల్స్ నుంచి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ వ‌ర‌కూ ఒక ప్ర‌త్యేక‌మైన సాంప్ర‌దాయాన్ని క‌లిగి ఉంటుంది. ఇక ప్ర‌తిసారీ ఈ ఫ్రాంఛైజీ సినిమాల్లో జేమ్స్ బాండ్ ఆరంభ స‌న్నివేశంలోనే అభిమానుల‌కు ట్రీటివ్వ‌డం రివాజు. కానీ ఈసారి ఆ సాంప్ర‌దాయాన్ని తుత్తునియ‌లు చేస్తూ నో టైమ్ టు డై సినిమాలో డేనియ‌ల్ క్రెయిగ్ ఆరంభ స‌న్నివేశంలో క‌నిపించ‌ర‌ని తెలుస్తోంది. 25 సినిమాల ఫ్రాంఛైజీలో ఇలా ఇదే మొట్ట‌మొద‌టి సారి కావ‌డంతో దీనిపై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక క్రెయిగ్ ఇప్ప‌టికే ఈ ఫ్రాంఛైజీ గ‌త రెండు చిత్రాల్లో బాండ్ గా న‌టించాడు. ప్ర‌తిసారీ ఓపెనింగ్ షాట్ లో క‌నిపించాడు. కానీ ఈసారి అలా జ‌ర‌గ‌ద‌ట‌.

అయితే నో టైమ్ టు డై  ప్రారంభ సన్నివేశంలో క్రెయిగ్ కాకుండా ఇంకెవ‌రు క‌నిపిస్తారు? రామి మాలెక్ .. లియా సెడౌక్స్  విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. `నో టైమ్ టు డై` క్రెయిగ్ కి చివ‌రి జేమ్స్ బాండ్ చిత్రం. అందుకే ఈ ట్విస్ట్ ఇస్తున్నార‌ట‌. ఆస్కార్ విజేత‌ రామి మాలెక్ తాజా మూవీతో ఫ్రాంచైజీలోకి ఎంట‌ర్ అయ్యాడు. ఇందులో బాండ్ ని ఢీకొనే విలన్ సఫిన్ పాత్రను పోషిస్తాడు. అంతేకాకుండా, లియా సెడాక్స్ బాండ్ ప్రియురాలు డాక్టర్ మాడెలైన్ స్వాన్ గా తిరిగి చేరుతోంది. బాండ్ 25 లో ఎన్నో ట్విస్టులు ఉంటాయిట‌.

ఇక‌పోతే నో టైమ్ టు డై విడుదల కోసం వచ్చే ఏడాది వరకు వేచి ఉండాల‌ని దర్శకుడు కారీ జోజి ఫుకునాగా వెల్ల‌డించారు. తన ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రొఫైల్ పీస్ ప్ర‌క‌ట‌న‌ సందర్భంగా ప్రారంభ సన్నివేశం గురించి వివరణాత్మక వర్ణనతో సిరీస్ అభిమానులను ఆటపట్టించాడు. తొలి సన్నివేశం జేమ్స్ బాండ్ సంప్రదాయాన్ని పూర్తిగా తుడిచేస్తోంది. బ్రిటీష్ స్పై 007 ప్రారంభ స‌న్నివేశంలో క‌నిపించ‌డు. మునుపటి 24 బాండ్ చిత్రాలలో ఇది ఎప్పుడూ చూడ‌నిది.

ఈ సిరీస్ లో బాండ్ పాత్ర‌ధారి క్రెయిగ్ కి  చివ‌రి సెండాఫ్ అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటున్నాం. జేమ్స్ బాండ్ నో టైమ్ టు డై .. థ్రిల్లింగ్ ఓపెనింగ్ సీక్వెన్స్ ద్వారా తీర్పు ఇవ్వడాన్ని చిరస్మరణీయ వీడ్కోలుగా భావిస్తున్నాం అని ద‌ర్శ‌కుడు తెలిపారు.  బెన్ విషా- పలోమాగా అనా డి అర్మాస్ -లాషనా లించ్ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. నో టైమ్ టు డై 2021 ఏప్రిల్ 2 న విడుదల కానుంది.
Tags:    

Similar News